ఏపీలో ఎన్నికల ముందు జంపింగులు మొదలైనట్టే!

మార్చి నెల ఆరంభంలో లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ వస్తుందని వార్తలు వస్తున్నాయి. లోక్ సభ సార్వత్రిక ఎన్నికలతో పాటే.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగతాయి. ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయ ఫిరాయింపులకు సమయం ఆసన్నమైనట్టే. ఇప్పుడే ఎవరి దారి వారు చూసుకుంటున్నారని తెలుస్తోంది. ముందుగా బీజేపీ నుంచినే ఇవి మొదలయ్యాయి. రానున్న ఎన్నికల్లో బీజేపీతో ఏ పార్టీ కూడా పొత్తు పెట్టుకునేలా లేదు. ఇలాంటి నేపథ్యంలో.. ఆ పార్టీ తరఫున గత ఎన్నికల్లో నెగ్గిన వారు తలా ఒక దిక్కుకు దూకేలా...

నారా వారి నిస్సిగ్గు రాజకీయం.. అలవాటైపోయింది!

ఫిరాయింపు రాజకీయాల విషయంలో చంద్రబాబు నాయుడు మరోసారి సూక్తిముక్తావళి వల్లించాడు. ఒకవైపు నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రులుగా తన కేబినెట్లో పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. అదీగాక… మరో ఇరవై మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు తెలుగుదేశంపార్టీలో ఎమ్మెల్యేలుగాచలామణి అవుతున్నారు. ఫిరాయించినందుకు వారిపై అనర్హత వేటు పడాలి. అయితే ఏపీ రాజకీయంలో ఫిరాయింపులు కమ్మగా అనిపిస్తున్నాయి. దీంతో వారిని ఎమ్మెల్యేలుగా కొనసాగించేస్తూ ఉన్నారు. ఇలా ఫిరాయింపు పర్వాన్ని నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు మరోవైపు..ఇటీవల తెలంగాణ ఎన్నికల సమయంలో మాట్లాడుతూ.. ఫిరాయింపులను తీవ్రంగా తప్పు పట్టేశాడు. ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి...

పవన్ విషయంలో బాబు మాట ఇది..!

జనసేన అధిపతి పవన్ కల్యాణ్ విషయంలో తన అభిప్రాయాన్ని తన పార్టీ వాళ్లకు సూటిగా చెప్పేశాడు చంద్రబాబు నాయుడు. పవన్ కల్యాణ్ ను ఎవ్వరూ ఏమీ అనొద్దని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు గట్టిగా ఆదేశాలు జారీ చేశాడు. తద్వారా పవన్ కల్యాణ్ తనకు కావాల్సిన వ్యక్తి అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశాడు. ఇటీవలే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ జనసేనలు పొత్తు పెట్టుకుంటే తప్పేంటి అని ప్రశ్నించాడు. అంత వరకూ పవన్ కల్యాణ్ ను మోడీ మనిషి అని...

జగన్ పై హత్యాయత్నం కేసు.. బాబుకు కోర్టులో ఝలక్!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం విషయంలో సాగుతున్న ఎన్ఐఏ విచారణను ఎలాగైనా ఆపించాలన్న చంద్రబాబు నాయుడి ప్రయత్నాలకు భంగపాటు తప్పడం లేదు. ఎన్ఐఏ విచారణను ఆపాలని అంటూ కోర్టులో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను తక్షణ విచారణకు తీసుకోలేదు న్యాయస్థానం. ఇది మరీ అత్యంత తక్షణం విచారించాల్సిన పిటిషన్ ఏమీ కాదని కోర్టు అభిప్రాయపడింది. దీనిపై విచారణను సోమవారానికి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. అసలుకు జగన్ పై హత్యాయత్నం కేసులో చంద్రబాబు నాయుడు...

నేనూ రాజ్‌పుత్‌నే.. వాళ్ల అంతు చూస్తాను

కంగనా రనౌత్‌ ‘మణికర్ణిక’ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఓ వివాదం నడుస్తోంది. దర్శకులు మారడం.. నటుడు సోనూసూద్‌ తప్పుకోవడం.. తాజాగా సినిమాలో ఝాన్సీ లక్ష్మీభాయ్‌ను తప్పుగా చిత్రీకరించారంటూ కర్ణిసేన నిరసన తెలియజేస్తున్నారు. ఈ విషయంపై కంగనా రనౌత్‌ స్పందిస్తూ– ‘‘మా సినిమాను నలుగురు చరిత్రకారులు చూసి సర్టిఫై చేశారు. సెన్సార్‌ బృందం కూడా చూసింది. కర్ణిసేనకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాం. ఇంకా మా సినిమా మీద అనవసరమైన వివాదాన్ని సృష్టిస్తున్నారు వాళ్లు. ఆ పనులు ఆపకపోతే వాళ్లు తెలుసుకోవాల్సిన విషయం...

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ నుంచి ఎన్టీఆర్‌ లుక్‌ విడుదల.. వర్మ చెప్పినంత పని చేసేశాడే!!

video

సంచలనాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ప్రస్తుతం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఒక్కో పాటను వదులుతూ హాట్‌ టాపిక్‌గా మారుతున్నాడు. నేడు ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా మరో అప్‌డేట్‌ను ఆర్జీవీ ప్రకటించేశాడు. ఎన్టీఆర్‌ వర్ధంతి నాడు ప్రకటించిన ఈ ప్రోమోలో ఎన్టీఆర్‌ పాత్రను రివీల్‌చేశాడు. ఏదో దీర్ఘాలోచనలో ఉన్న ఎన్టీఆర్‌ లుక్‌ను తనదైన శైలిలో ఆర్జీవీ విడుదల చేశారు. వెన్నుపోటు పొడిచిన తరువాత ఎన్టీఆర్‌ మళ్లీ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లో సజీవంగా తిరిగి వస్తున్నారు అంటూ ట్వీట్‌ చేస్తూ ఎన్టీఆర్‌ లుక్‌ను...

షర్మిల కేసులో ఐదుగురి అరెస్ట్.. పోలీసు విచారణ వేగవంతం

ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిలపై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారంపై నమోదైన కేసులో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చర్యలు ప్రారంభించారు. సోమవారం ఆమె ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైన విషయం విదితమే. దీనికి కీలక ప్రాధాన్యం ఇస్తున్న అధికారులు బాధ్యుల్ని పట్టుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు. యూట్యూబ్‌లో దాదాపు 60 వీడియో లింకుల్ని గుర్తించిన పోలీసులు అవి ఏయే యూట్యూబ్‌ చానల్స్‌కు సంబంధించినవో గుర్తించే పనిలో ఉన్నారు. ఆయా చానల్స్‌లో ఉండే వివరాల ఆధారంగా బాధ్యుల్ని గుర్తిస్తున్నారు. శుక్రవారం నాటికి...

జగన్ పై అటాక్ః టీడీపీ ముఖ్యనేతకు ఎన్ఐఏ పిలుపు?!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై విచారణ చేపట్టిన ఎన్ఐఏ కు కీలకమైన సమాచారం లభ్యమైందనే మాట వినిపిస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు విచారించారు. ఏకంగా సుదీర్ఘంగా ముప్పై గంటల పాటు శ్రీనివాసరావును అధికారులు విచారించినట్టుగా తెలుస్తోంది. శ్రీనివాసరావు అలాంటి ఆకు రౌడీ చేత అసలు విషయాన్ని కక్కించడం ఎన్ఐఏ అధికారులకు పెద్ద కథ ఏమీ కాదు. ఇప్పటికే అతడి విచారణ పూర్తి చేసిన అధికారులు.. ప్రత్యక్ష సాక్షుల విచారణను...

ఎన్టీఆర్ బయోపిక్.. భారీ నష్టాలు.. బాలయ్య రీ పే చేస్తాడా?!

తొమ్మిది రోజులను పూర్తి చేసుకున్నా.. ఎన్టీఆర్ బయోపిక్ గట్టి గా ఇరవై కోట్ల రూపాయల షేర్ కూడా సాధించలేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాకు భారీ ప్రచారాన్నే కల్పించారు. భారీగా హైప్ ను పెంచారు. దానికి తోడు మహానటి సినిమా విజయవంతం అయి ఉండటంతో.. ఆ కాలం నాటిసినిమాగా దీనిపై సర్వత్రా ఆసక్తి నిలిచింది. కేవలం ఎన్టీఆర్ బయోపిక్ గానే కాకుండా.. నాటి సినిమా తారల ప్రస్తావనతో ఈ సినిమా ఆసక్తిదాయకంగా ఉంటుందని అంతా అనుకున్నారు. దీంతో సగటు ప్రేక్షకుల్లో కూడా...