వాళ్ల కష్టానికి జగన్ ‘థ్యాంక్స్’ చెప్పారు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గత ఐదేళ్లలో మీడియా అండ పెద్దగా లేకపోయినా.. ఆ పార్టీకి సోషల్ మీడియానే బాగా అండగా నిలిచింది. ఎన్నికలకు చాలా ముందు నుంచినే సోషల్ మీడియాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు బాగా యాక్టివ్ గా ఉంటూ వచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం అయితేనేం, తమ పార్టీ అజెండాను నెటిజన్ల మధ్యకు తీసుకెళ్లడంలో అయితేనేం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు విజయవంతం అయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైన్యాన్ని చూసి తెలుగుదేశం వాళ్లే...

‘చంద్రబాబూ.. సొంతిల్లు కట్టుకోవా?’

అమరావతి ప్రాంతంలో తను ఇన్నాళ్లూ అద్దెకు నడిపిన తన అధికారిక నివాసంలో భాగమైన భవనానికి ఆనుకుని ఉన్న 'ప్రజావేదిక'ను తన అధికారిక నివాసంగా గుర్తించాలన్న చంద్రబాబు లేఖపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ ఉంది. అక్కడ తనను కలవడానికి వచ్చిన వారితో సమావేశం అవుతుండటం జరుగుతుందంటూ చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో జగన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తిదాయకంగా మారింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి...

టీడీపీ ముగ్గురు ఎంపీల్లో.. ఒకరు చేజారినట్టేనా!

లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ముక్కిమూలిగి నెగ్గింది కేవలం ముగ్గురు మాత్రమే! అన్ని ఎంపీ సీట్లలోనూ తెలుగుదేశం పార్టీ వాళ్లను గెలిపించాలని చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తే.. ఆయన ఐదేళ్ల పాలన తీరును గమనించిన తర్వాత ఏపీ ప్రజలకు కేవలం మూడు సీట్లలో మాత్రమే తెలుగుదేశం పార్టీ వాళ్లను గెలిపించారు. అలా మూడు సీట్లకు పరిమితం అయ్యింది టీడీపీ. ఈ క్రమంలో ఆ ముగ్గురు అయినా తెలుగుదేశం పార్టీలో ఉంటారా? అనేది సందేహంగానే నిలుస్తూ వస్తోంది. ఎందుకంటే అధికారంలో లేని...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డికి మరో కీలక బాధ్యత!

వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటు విజయసాయి రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరో కీలక బాధ్యత దక్కింది. సాయి రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. పార్టీ తరఫున ఎంపీలందరికీ అధ్యక్షుడిగా ఉండబోతున్నారు విజయసాయి రెడ్డి. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి కూడా జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేతగా ఎవరు ఉండబోతున్నారు? అనేది గత కొన్నాళ్లుగా చర్చనీయాంశంగా నిలిచింది. పార్లమెంటరీ...

ఆ ప్రచారాన్ని ఖండించిన నటుడు మోహన్ బాబు!

తను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవి రేసులో ఉన్నట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు నటుడు మోహన్ బాబు. తను ఏ పదవులనూ ఆశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, తను కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలనే ఆకాంక్ష మేరకే ఆ పార్టీలో చేరినట్టుగా మోహన్ బాబు ప్రకటించారు. తన విషయంలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని మోహన్ బాబు స్పష్టం చేశారు. ఏపీలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంతో అధికారాన్ని చేపట్టిన...

కాళేశ్వరంలో మెగా పవర్‌

కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అవసరమైన భారీ విద్యుత్ సరఫరా వ్యవస్థలో అత్యధిక భాగాన్ని ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేసి తన చరిత్రను తానే తిరగరాసింది. ఇంతవరకు నీటిపారుదల రంగానికి ఎక్కడా ఏర్పాటు కానటువంటి అతిపెద్ద విద్యుత్ సరఫరా వ్యవస్థ రికార్డు సమయంలో పూర్తి చేసింది. ఈ విద్యుత్ సరఫరా వ్యవస్థ ఎంత పెద్దదంటే దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు సరఫరా అయ్యే విద్యుత్ తో సమానమైనది. ఈశాన్య రాష్ట్రాల విద్యుత్‌ సరఫరా మొత్తం 3916 మెగావాట్లు కాగా, కాళేశ్వరం ప్రాజెక్టుకోసం ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేసిన విద్యుత్‌ వ్యవస్థ...

ఆరోగ్య శ్రీ కి వైఎస్ టచ్..జగన్ ప్రత్యేక దృష్టి

వైద్య ఆరోగ్య శాఖ పై ప్రత్యేక దృష్టిని సారించనున్నట్టుగా ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో జగన్ మోహన్ రెడ్డి సోమవారం రోజున సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో జగన్ కీలకమైన ప్రకటనలు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మీద తనే ప్రత్యేక దృష్టి సారించబోతూ ఉన్నట్టుగా జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వాసుపత్రుల్లో సామాన్యులకు సరైన వైద్య సదుపాయాలు అందేలా చూడాలని జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆసుపత్రుల్లో మౌళిక...

దివాకర్ రెడ్డి టోన్ మారింది.. రాజకీయాలకు గుడ్ బై అట!

తను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఇక మరే పార్టీలోకి చేరే ఉద్దేశం లేదని, తను ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్టుగా దివాకర్ రెడ్డి ప్రకటించారు. ఈ ఎన్నికల్లో దివాకర్ రెడ్డి పోటీ చేయని సంగతి తెలిసిందే. అనంతపురం నుంచి జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి పవన్ రెడ్డి చిత్తుగా ఓడారు. అంతే గాక తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ...

భర్తతో శ్రియ హాట్ పోజు!

ఇది వరకూ సినిమాల్లో హాట్ హాట్ గా కనిపించేది శ్రియ. గత ఏడాది ఈమె పెళ్లి చేసుకుంది. పెళ్లి అయినా ఆమె సినిమాల్లో అయితే కొనసాగుతూ ఉంది. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ సినిమాలు చేస్తూనే ఉంది. మధ్యలో విరామం దొరికిప్పుడు భర్తతో గడుపుతోంది ఈ హీరోయిన్. గత ఏడాది శ్రియ ఒక విదేశీయుడిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమాల విరామంతో అతడితో గడుపుతోంది ఈ నటీమణి. అందులో భాగంగా తాజాగా ఒక పిక్ ను సోషల్ మీడియాలో పోస్టు చేసింది శ్రియ. భర్తకు చంకన...

ఆ సినిమాకు లారెన్సే దర్శకుడు!

బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న లారెన్స్ ఆదిలోనే వివాదాన్ని ఎదుర్కొన్నాడు. అతడే దర్శకత్వం వహించి తమిళంలో రూపొందించిన 'కాంచన' సినిమాను హిందీలో రీమేక్ చేయడం ద్వారా లారెన్స్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ముని సీరిస్ లారెన్స్ కు చాలా వరకూ కలిసి వచ్చింది. ఇప్పటికే తమిళంలో ఆ సీరిస్ లో నాలుగు సినిమాలు వచ్చాయి. అవన్నీ తెలుగులోకి అనువాదం అయ్యి తమిళంతో సమానమైన విజయాన్ని సాధించాయి. ఇక లారెన్స్ బాలీవుడ్ ఎంట్రీకి కూడా ఆ సీరిస్ లోని సినిమానే ఉపయోగపడుతూ ఉంది. 'కాంచన' సినిమాను లారెన్స్...