జనసేన మౌనమేలా?

గుంటూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌ అక్రమమైనింగ్‌పై సీఐడీ విచారణను వైసీపీ ఇన్‌చార్జ్ కాసు మహేష్ తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్న సీఐడీతో విచారణ జరిపిస్తే నిజాలు బయటకు వచ్చే అవకాశమే లేదన్నారు. సీబీఐ విచారణ చేయించాలన్నారు. . ఇప్పటికే సీఐడీ అగ్రిగోల్డ్ కుంభకోణం విషయం ఏమీ సాధించలేకపోవడాన్ని అందరం చూశామన్నారు. యరపతినేనిని కాపాడేందుకు గురజాలలో రోజుకో నాటకాన్ని తెరపైకి తెస్తున్నారని మహేష్ అన్నారు. కుంభకోణంపై విచారణ జరిపిస్తే యరపతినేని ఇంటి దగ్గర మొదలై అది చంద్రబాబు ఇంటి గడప వద్ద ఆగుతుందన్నారు....

మోడీ షా లకు ఈసీ ఝలక్!!

పార్లమెంటుకు, రాష్ట్రాల అసెంబ్లీల అన్నిటికి ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలనే సూచన బీజేపీ చీఫ్ అమిత్ షా చేసి విషయం తెలిసిందే. ఈ సూచనపై ఎన్నికల కమిషన్ (ఈసీ) స్పందించింది. జమిలి ఎన్నికలు అనేవి భారతదేశం లో సాధ్యం కాదని, ఒకేసారి ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే సాధనా సంపత్తి మనకి ఇంకా లేదని ఈసీ పేర్కొంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎలెక్షన్స్‌ తో బాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించ జాలమని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపి రావత్ తెలిపారు. జమిలి ఎన్నికలకు...

ఎన్టీఆర్ 60 ఏళ్ళు ఆగితే పవన్ కి తొందరెందుకు?

ముఖ్య‌మంత్రి ప‌ద‌వి గురించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందన పై పలు రకాల కామెంట్స్ వినపడుతున్నాయి. నిన్న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నిడ‌ద‌వోలులో జ‌రిగిన ప్ర‌జాపోరాట యాత్ర‌లో పాల్గొన్న పవన్ జ‌న‌సేన సిద్ధం చేయ‌బోతున్న మేనిఫెస్టో గురించి చెప్పి తమ మేనిఫెస్టో లో అన్ని వ‌ర్గాల‌కూ న్యాయం చేస్తామ‌న్నారు. నారా లోకేష్ ని ఉద్దేశించి… ‘తను ముఖ్యమంత్రి కావాలంటే అరవయ్యేళ్లు ఆగాలి అన్నారు. 60 ఏళ్లు సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌ష్ట‌ప‌డి పేరు సంపాయించుకుని అప్పుడు ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యార‌ని గుర్తు చేశారు. తాను...

బాబు సర్కార్‌కు హైకోర్టు షాక్… పథకంపై స్టే

చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. చంద్రబాబు తన అత్త బసవతారకం పేరు మీద ప్రవేశపెట్టిన పథకంపై కోర్టు స్టే విధించింది. ఆగస్టు 15న బసవతారకం బాలింత కిట్ పథకాన్ని చంద్రబాబు ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ పథకంలో అక్రమాలు జరిగాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అక్రమాలు కళ్లెదుట కనిపించడంతో పథకం అమలుపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ పథకం కింద ప్రభుత్వ ఆస్పత్రిల్లో ప్రసవించే బాలింతలకు ఒక చీర, ఒక రంగు, 40 శానిటరీ పాడ్స్ ఇవ్వనున్నారు.   ఈ కిట్ల సరఫరాకు పిలిచిన...

మందు నిషేధం పై జన సేనాని విజనేమిటో ?

జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన విజన్ డాక్యుమెంట్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. భీమవరం లో నిర్వహించిన కార్యక్రమంలో పవన్ విజన్ని విడుదల చేశారు. అందులో ఆయన పన్నెండు హామీలు ఇచ్చారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు, బిసి వర్గాలకి అవకాశాన్ని బట్టి 5శాతం రిజర్వేషన్ ల పెంపుదల, కాపు లకు రిజర్వేషన్లు తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చే అంశం పై జన సేన ప్రయత్నం, మహిళల కు రేషన్ కి బదులుగా ప్రతి నెలా 2500రూపాయల నగదు బదిలీ...

జనసేన విజన్ మేనిఫెస్టో విడుదల..

జనసేన పార్టీ తన విజన్ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఏడు సిద్ధాంతాలు, 12 హామీలను మేనిఫెస్టోలో ప్రకటించింది. కులాలను, రిజర్వేషన్లను బేస్‌ చేసుకుని వాటిని తయారు చేశారు. జనసేన హామీల్లో క్లిష్టమైన రిజర్వేషన్లకు సంబంధించిన హామీలే నాలుగు ఉన్నాయి. జనసేన ప్రకటించిన సిద్ధాంతాలు.. 1. కులాలను కలిపే ఆలోచనా విధానం 2. మతాల ప్రస్తావన లేని రాజకీయం 3. భాషలను గౌరవించే సంప్రదాయం 4. సంస్కృతులను కాపాడే సమాజం 5. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం 6. అవినీతిపై రాజీలేని పోరాటం 7. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేన ఇచ్చిన 12 హామీలు... 1. మహిళలకు 33శాతం...

ఏపీలో వైసీపీ స్ట్రోక్‌ ఎలా ఉందో ఒప్పుకున్న రాహుల్

ఏపీలో కాంగ్రెస్ పరిస్థితిని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంగీకరించారు. ఏపీలో తమ పార్టీకి తిరుగులేదని.. బీభత్సమైన బలం ఉందని మాట వరుసకైనా చెప్పలేకపోయారు. హైదరాబాద్‌లో ఎడిటర్లతో జరిగిన సమావేశంలో ఏపీలో కాంగ్రెస్‌  పూర్తిస్థాయిలో పుంజుకోని మాట వాస్తవమేనన్నారు. కేవలం ఓట్ల శాతం మాత్రమే పెరిగిందని రాహుల్ అంగీకరించారు. 2014కు ముందు వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ తిరిగి 2019లో ఏపీలో సత్తా చాటుతుందని కూడా రాహుల్ గాంధీ ధీమాగా చెప్పలేకపోయారు. అదే సమయంలో టీడీపీతో పొత్తుకు సంకేతాలిచ్చారు. టీడీపీతో పొత్తు ప్రతిపాదనను రాహుల్ తోసిపుచ్చలేదు....

దటీజ్ కాంగ్రెస్‌… రేవంత్ కు రవ్వంతరెడ్డి హోదా

కాంగ్రెస్‌లో చేరే సమయంలో రేవంత్ రెడ్డి చేసిన హడావుడి అంతా ఇంతాకాదు. తనను తాను బాహుబలిగా ప్రచారం చేసుకున్నాడు. కానీ కాంగ్రెస్‌ అంటే ఏంటో ఇప్పుడు రేవంత్ రెడ్డికి తెలిసి వచ్చింది. కాంగ్రెస్ తనను రవ్వంత రెడ్డిగానే గుర్తిస్తున్న విషయం రాహుల్ పర్యటనలో రేవంత్‌కు స్పష్టంగా అర్థమైంది. హైదరాబాద్‌లో పార్టీ సీనియర్లతో రాహుల్ సమావేశానికి రేవంత్ రెడ్డికి అవకాశం ఇవ్వలేదు. సీనియర్ల జాబితాలో రేవంత్ రెడ్డి పేరు లేదు. అయినప్పటికీ ఎలాగైనా పాస్‌ సంపాదించాలని రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దీంతో రేవంత్...

బంధం మరింత బలపడింది… రాహుల్‌తో బ్రహ్మణి భేటీ

బీజేపీ, కమ్యూనిస్టులతో పలుమార్లు, టీఆర్‌ఎస్‌తో ఒకమారు, జనసేనతో ఒకసారి పొత్తు పూర్తి చేసి ఆ తర్వాత విడాకులు ఇచ్చిన చంద్రబాబు.. ఇక మిగిలిన కాంగ్రెస్‌తోనూ పొత్తుకాపురానికి దాదాపు సిద్ధమయ్యారు. కొత్తదనం కోరుకుంటున్న కాంగ్రెస్‌ కూడా చంద్రబాబుతో కాపురానికి సై అంది. అప్పటి నుంచి పలుమార్లు ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకునేందుకు కాంగ్రెస్‌, టీడీపీలు అవకాశం దొరికినప్పుడల్లా ప్రయత్నిస్తున్నాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతు ఇవ్వడం ద్వారా తమ ప్రేమను బహిరంగంగానే చంద్రబాబుప్రదర్శించారు. ఈ నేపథ్యంలో అధికారిక పొత్తు ప్రకటన మాత్రమే మిగిలి...