LATEST ARTICLES

కోహ్లీ పోస్టు కి అర్ధం ఏమిటో…!!

కోహ్లీ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడా? భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ యాక్టింగ్ రంగంలో ప్రవేశిస్తున్నాడా...మైదానాన్ని ఎలా ఐతే సొంతం చేసుకున్నాడో బాలీవుడ్ ని కూడా సొంతం చేసుకోబోతున్నాడా అంటే అవున నే సమాధానం వస్తోంది. కారణం కోహ్లీ తన ట్విటర్ ఖాతాలో పెట్టిన తాజా పోస్టు. ఈ వాదనకు బలం చేకూరేలా వుంది ఆ పోస్టు. కోహ్లీ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న ఏషియకప్‌కు దూరంగా ఉన్నాడు...సో కోహ్లీ సినిమా చిత్రీకరణ లో ఉన్నాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ట్విటర్లో షేర్ చేసిన పోస్టరు...

“కోర్టులపై బాబుకు గౌరవం నాస్తి!”

ప్రధాని మోదీ అంటే చంద్రబాబుకు భయ౦ అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. సీఎం చంద్రబాబు తన నీడను చూసుకొని కూడా భయపడే స్టేజి లో వున్నారని ఎద్దేవా చేశారు. విశాఖపట్నం లో మాట్లాడిన కన్నాబాబు పై సెటైర్లు వేశారు. చంద్రబాబు బాబ్లీ కేసు పేరుతో కొత్త డ్రామాలాడుతున్నారని ప్రధాని మోదీ పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ధర్మాబాద్ కోర్టు ఎన్నోసార్లు నోటీసులు పంపినా చంద్రబాబు హాజరు కాలేదని, ఇప్పుడు కోర్టులను కించపరిచే విధంగా బాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రచార ఆర్భాటాల...

జూ ఎన్టీఆర్….ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచే పని చేస్తాడా?

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమో కాదో తెలియదు కాని దాని ప్రకారం హరికృష్ణ కుమారుల మధ్య తేడాలు సృష్టించడానికి రాజకీయ భేదాలు కలగచేయడానికి ప్రయత్నాలు మొదలైయ్యాయట...తెదేపా అదినేత చంద్రబాబు దివంగత నేత హరికృష్ణ కుమారుడు కళ్యాణ్ రామ్ ను రాజకీయాల్లోకి తెచ్చి తెదేపా తరపున పోటీచేయించాలని చూస్తున్నారట. జూ ఎన్.టిఆర్ ప్రస్తుతానికి రాజకీయాలలోకి రావడానికి ఆసక్తి చూపడం లేదు అయితే కళ్యాణ్ రామ్ ను పోటీచేయిస్తే ఎన్.టి.ఆర్ ప్రచారం చేస్తారని బాబు ఆశ ....దీనివల్ల కాంగ్రెస్, టిడిపిల అనైతిక కూటమి కి స్వయంగా...

నోటుకు ఓటు కేసు – బాబు పై బిగిస్తున్న ఈడీ ఉచ్చు

బాబు కి కష్టాలు మొదలయ్యాయా అంటే ఔననే అంటున్నాయి మీడియా వర్గాలు. ఓటుకు నోటు కేసులో ఈడీ రంగంలోకి దిగబోతోంది అన్న వార్తే అందుకు సాక్ష్యం. ఆ కేసులో ఐదు కోట్ల పై నిగ్గు తేల్చాలంటూ ఈడీ తో సహా కేంద్ర సంస్థ లకు పోలీసు ఉన్నతాధికారుల లేఖ వెళ్లడం షాక్ గొలిపే అంశమే ఓ పక్క తెలంగాణ ముందస్తు ఎన్నికలకు రెడీ అంటున్న సందర్భం లో ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పై తెలంగాణ పోలీసు వర్గాలు వార్త ప్రకారం ఓటుకు...

‘ఈ మాయ పేరేమిటో’ మూవీ రివ్యూ

టైటిల్ : ఈ మాయ పేరేమిటో తారాగణం : రాహుల్‌ విజయ్‌, కావ్యా థాపర్‌, రాజేంద్రప్రసాద్, మురళీ శర్మ, ఈశ్వరీరావు తదితరులు సంగీతం : మణిశర్మ దర్శకత్వం : రాము కొప్పుల నిర్మాత : దివ్యా విజయ్‌ సీనియర్‌ ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌ ఎన్నేళ్ల నుంచో సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నారు. అగ్రహీరోలందరితో పనిచేసి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. విజయ్‌ కుమారుడు రాహుల్‌ విజయ్‌ ‘ఈ మాయ పేరేమిటో’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌, నాగ చైతన్య, సుకుమార్‌ లాంటి సెలబ్రెటీలను ముఖ్య అతిథులుగా పిలిచి సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేశారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని నిర్మించింది కూడా విజయ్‌ కూతురు...

టీడీపీ తెలుగు ద్రోహుల పార్టీ: రాంమాధవ్‌

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో గురువారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ  ‘రాష్ట్రానికి ఎంతో ద్రోహం చేసిన అధికార టీడీపీ తెలుగు ద్రోహుల పార్టీగా నిలిచింది. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోంది’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసి రాంమాధవ్‌ ఆరోపించారు.. టీడీపీ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రజలకు వివరించి, 2019 ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించి తీరాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రూ.8.50 లక్షల కోట్ల విలువైన వనరులున్న రాష్ట్రాన్ని చక్కగా పరిపాలించి ముందుకు తీసుకెళ్లాల్సిందిపోయి అవినీతి అరాచక...

అరవింద సమేత: పెనివిటి సాంగుకు సూపర్ రెస్పాన్స్

video

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అరవింద సమేత' చిత్రానికి సంబంధించి 'పెనివిటి' సాంగుకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ లిరికల్ సాంగ్ విడుదలైన 24 గంటల్లోపే 2 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను ఎస్ఎస్ థమన్ కంపోజ్ చేయగా.. కాల భైరవ పాడారు. ఈ సాంగ్ విన్న ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతున్నారు. లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి చెప్పినట్టుగా ఈ పాట పదికాలాలపాటు గుర్తుండి పోతుంది...

బాబు సెక్షన్ 8ని దుర్వినియోగం చేస్తున్నారని కెసిఆర్ గుర్రు

ఇంతకు మునుపు హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు జరగడంలేదని గవర్నర్ నరసింహన్ పై తెదేపా నేతల కంప్లైంట్ లు ఉండేవి. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సెక్షన్ 8 ని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుర్వినియోగం చేస్తున్నారని కంప్లైంట్ అట. ఇక దీనిపై గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారట. అన్ని డిపార్ట్మెంట్ లు ఖాళీ చేసేసి అమరావతి వెళ్లిపోయాక ఇప్పుడు మళ్ళీ పోలీస్ నిఘా విభాగాన్ని హైదరాబాద్ కి రప్పించి చంద్రబాబు తెలంగాణ లో సర్వేలు చేయిస్తున్నారని ఆరోపణ....

బాబు కి నామం పెట్టబోతున్న తితిదే చైర్మన్

జన సేన పార్టీ లోకి ప్రముఖ తెలుగుదేశం నాయకుడు చేరబోతున్నారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి జన సేన లోకి చేరడానికి ముహూర్తం ఖరారైందని అంటున్నారు. తెదేపా కి గుడ్ బై చెప్పి విజయ దశమి నాడు ఆయన జనసేన లో చేరతారట. ఇటీవలే చదలవాడ జన సేన పార్టీ అదినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. పార్టీలో చేరాలన్న తన ఆసక్తిని వ్యక్తం చేయగా పవన్ కూడా సరే అనడం జరిగింది.