Home సినిమా అలాంటి సినిమాలు చూడటనన్న కత్రినా!

అలాంటి సినిమాలు చూడటనన్న కత్రినా!

SHARE

తను నటించే సినిమాల విషయంలో లేని అభ్యంతరం కత్రినాకు చూసే సినిమాల విషయంలో మాత్రం ఉందట. ఈ ఆంగ్లో ఇండియన్ హీరోయిన్ బాలీవుడ్ లో టాప్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇటీవలే సల్మాన్ ఖాన్ సినిమా ‘భారత్’ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఉంది కత్రినా కైఫ్. ఈ సందర్భంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కత్రినా కైఫ్ తను ఎలాంటి సినిమాలను చూడాలనే విషయం గురించి వివరించింది.

ప్రత్యేకించి హారర్ సినిమాలు చూడటం అంటే తనకు భయమని అంటోంది కత్రినా కైఫ్. తను హారర్ సినిమాలను చూసి దడుచుకునే స్వభహావాన్ని కలిగి ఉంటానంటూ, అలాంటి సినిమాలు చూడటం ఏ మాత్రం ఇష్టం ఉండదని కత్రినా చెబుతోంది. భయం వల్లనే తను హారర్ సినిమాలకు దాదాపుగా దూరంగా ఉంటానంటూ చెప్పుకొచ్చింది కత్రినా కైఫ్.

కెరీర్ లో ఇప్పటి వరకూ ఎప్పుడూ హారర్ సినిమాల్లో నటించినట్టుగా లేదు కత్రినా. ఒకవైపు బాలీవుడ్ లో హారర్ సినిమాల ట్రెండ్ కొనసాగుతూ ఉంది. అయినా కత్రినా మాత్రం అలా హారర్ సినిమాలు చూడటానికే భయమని చెబుతూ ఉండటం గమనార్హం.

రొమాంటింక్ ఎంటర్ టైనర్లను చూడటానికి తను ఇష్టపడతానంటూ కత్రినా కైఫ్ చెప్పుకొచ్చింది. హాలీవుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్లను వీక్షించడం తన ఇంట్రస్ట్ అని కత్రినా కైఫ్ చెప్పుకొచ్చింది.