Home రాజకీయాలు ఏపీలో అసెంబ్లీ.. ఆసక్తికర సన్నివేశాలు!

ఏపీలో అసెంబ్లీ.. ఆసక్తికర సన్నివేశాలు!

SHARE

బుధవారం నుంచి ఏపీలో నూతన ప్రభుత్వం ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో అమరావతి వేదికగా శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ముఖ్యమంత్రిగా బుధవారం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతూ ఉన్నారు.

మొత్తం ఐదు రోజుల పాటు ఈ దఫా అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. అందులో భాగంగా ముందుగా శాసన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. బుధవారమే ఆ ప్రక్రియ ప్రారంభం కానుంది.

ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వంతు అని అని తెలుస్తోంది. ఆపై ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది.

బుధవారం పూర్తిగా ఈ కార్యక్రమమే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ప్రొటెం స్పీకర్ గా ఎన్నికైన అప్పల్నాయుడు ఎన్నికైన ఎమ్మెల్యే చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ కార్యక్రమంతో తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు ముగిసే అవకాశం ఉంది.

మరుసటి రోజు సభ యథావిధిగా సమావేశం కానుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం కార్యక్రమం కూడా ఉంటుంది. అనంతరం రెండు రోజలు పాటు సభకు సెలవులు. ఆ తర్వాత రెండు రోజుల పాటు సమావేశాల అనంతరం ఏపీ నూతన శాసనసభ సమావేశాలు ముగుస్తాయి.