Home రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డికి మరో కీలక బాధ్యత!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డికి మరో కీలక బాధ్యత!

SHARE

వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటు విజయసాయి రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరో కీలక బాధ్యత దక్కింది. సాయి రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. పార్టీ తరఫున ఎంపీలందరికీ అధ్యక్షుడిగా ఉండబోతున్నారు విజయసాయి రెడ్డి. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి కూడా జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేతగా ఎవరు ఉండబోతున్నారు? అనేది గత కొన్నాళ్లుగా చర్చనీయాంశంగా నిలిచింది. పార్లమెంటరీ పక్ష సమావేశం అప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఎవరికి ఆ బాధ్యతలు అప్పగిస్తున్నదీ ప్రకటించలేదు. తాజాగా అందుకు సంబంధించిన ప్రకటన వచ్చింది. ఆ అవకాశం విజయసాయి రెడ్డికి దక్కింది.

విజయ సాయి రెడ్డి పార్లమెంట్ లోని ఇరు సభల్లోని ఎంపీలకూ అధ్యక్షుడుగా వ్యవహరించబోతున్నారు. లోక్ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా మిథున్ రెడ్డి ఉంటారని తెలుస్తోంది. లోక్ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విప్ గా మార్గాని భరత్ రామ్ వ్యవహరించబోతూ ఉన్నారు.

ఈ నియామకాలకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు జగన్ మోహన్ రెడ్డి లేఖను పంపించినట్టుగా సమాచారం.