Home సినిమా ఆ ప్రచారాన్ని ఖండించిన నటుడు మోహన్ బాబు!

ఆ ప్రచారాన్ని ఖండించిన నటుడు మోహన్ బాబు!

SHARE

తను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవి రేసులో ఉన్నట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు నటుడు మోహన్ బాబు. తను ఏ పదవులనూ ఆశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, తను కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలనే ఆకాంక్ష మేరకే ఆ పార్టీలో చేరినట్టుగా మోహన్ బాబు ప్రకటించారు. తన విషయంలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని మోహన్ బాబు స్పష్టం చేశారు.

ఏపీలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంతో అధికారాన్ని చేపట్టిన నేపథ్యంలో టీటీడీ బోర్డు కు కొత్త చైర్మన్ రావడం ఖాయమైంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నియమించిన బోర్డును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ మోహన్ రెడ్డి రద్దు చేయడం ఖరారు అయ్యింది. ఇప్పటికే పలువురు టీటీడీ బోర్డు పదవులకు రాజీనామాలు చేశారు.

అయితే బోర్డు చైర్మన్ సుధాకర్ యాదవ్ మాత్రం రాజీనామా చేయడం లేదు. దీంతో బోర్డును ఏపీ ప్రభుత్వం రద్దు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త గా చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా నిలుస్తోంది.

అందులో భాగంగా నటుడు మోహన్ బాబు పేరు కూడా ఆ విషయంలో వినిపించింది. ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి దక్కనుందని ప్రచారం జరిగింది. అయితే ఆ ఊహాగానాలను మోహన్ బాబు ఖండించారు. తను కేవలం జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని మాత్రమే మళ్లీ రాజకీయాల్లోకి వచ్చినట్టుగా తను ఏ పదవినీ ఆశించడం లేదని మోహన్ బాబు స్పష్టం చేశారు.