Home రాజకీయాలు జగన్ కేబినెట్ పై క్లారిటీ ఎప్పుడంటే!

జగన్ కేబినెట్ పై క్లారిటీ ఎప్పుడంటే!

SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల కోసం గట్టి పోటీ నెలకొని ఉంది. ఏకంగా నూటా యాబై ఒక్క మంది ఎమ్మెల్యేలు నెగ్గారు. అలాగే మరి కొందరు ఎమ్మెల్సీ పదవుల ద్వారా మంత్రి పదవులను ఆశిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో జగన్ మోహన్ రెడ్డి ఎవరికి అవకాశం ఇస్తారనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఆశావహుల సంఖ్య గట్టిగా ఉంది. వారిలో ఎవరికి జగన్ అవకాశం ఇస్తారు, మరెవరిని నిరాశ పరుస్తారు.. అనే అంశం గురించి కూడా ఊహాగానాలు అనేకం సాగుతూ ఉన్నాయి.

కేబినెట్ ఏర్పాటు గురించి అయితే ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్పేసింది. జూన్ ఎనిమిదో తేదీన ఏపీ నూతన కేబినెట్ ఏర్పాటు కాబోతోంది. ఈ మేరకు ఏర్పాట్లు సాగుతూ ఉన్నాయి. జూన్ ఎనిమిదో తేదీన పదకొండూ ముప్పై తొమ్మిది నిమిషాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ ఏర్పాటు కానుంది. మంత్రుల చేత ప్రమాణ స్వీకారోత్సవం చేయించడానికి రంగం సిద్ధం అయ్యింది.

అదే రోజు ఉదయం ఎనిమిది గంటలా ముప్పై తొమ్మిది నిమిషాలకు జగన్ మోహన్ రెడ్డి సచివాలయంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలిసారి అలా సెక్రటేరియట్ లోకి జగన్ వెళ్తున్నారు.
మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం ఆరోజే అయినా మంత్రి వర్గంలో స్థానం ఎవరెవరికి అనే అంశం గురించి మాత్రం జూన్ ఆరో తేదీనే ప్రకటన రాబోతోందట. మంత్రి వర్గం జాబితాను ఆరోజే ప్రకటించనున్నారని సమాచారం!