Home సినిమా భర్తతో శ్రియ హాట్ పోజు!

భర్తతో శ్రియ హాట్ పోజు!

SHARE

ఇది వరకూ సినిమాల్లో హాట్ హాట్ గా కనిపించేది శ్రియ. గత ఏడాది ఈమె పెళ్లి చేసుకుంది. పెళ్లి అయినా ఆమె సినిమాల్లో అయితే కొనసాగుతూ ఉంది. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ సినిమాలు చేస్తూనే ఉంది. మధ్యలో విరామం దొరికిప్పుడు భర్తతో గడుపుతోంది ఈ హీరోయిన్.

గత ఏడాది శ్రియ ఒక విదేశీయుడిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమాల విరామంతో అతడితో గడుపుతోంది ఈ నటీమణి. అందులో భాగంగా తాజాగా ఒక పిక్ ను సోషల్ మీడియాలో పోస్టు చేసింది శ్రియ.

భర్తకు చంకన ఎక్కింది ఈ నటీమణి. మెక్సికన్ బీచ్ లో ఈ జంట అలా విహరిస్తోంది. అందుకు సంబంధించిన ఈ పిక్ ను సోషల్ మీడియాలో పెట్టింది. తమ అన్యోన్య దాంపత్యాన్ని ఇలా చాటి చెప్పుకుంటోంది శ్రియ.

‘పెళ్లి అయ్యింది కదా.. పిల్లలు?’ అంటే.. శ్రియ ఇప్పుడప్పుడే కాదని అంటోంది. కనీసం ఇంకో ఇరవై సినిమాల్లో నటించిన తర్వాతే పిల్లల గురించి ఆలోచన అని శ్రియ చెప్పింది ఇది వరకే!