Home సినిమా ఆ సినిమాకు లారెన్సే దర్శకుడు!

ఆ సినిమాకు లారెన్సే దర్శకుడు!

SHARE

బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న లారెన్స్ ఆదిలోనే వివాదాన్ని ఎదుర్కొన్నాడు. అతడే దర్శకత్వం వహించి తమిళంలో రూపొందించిన ‘కాంచన’ సినిమాను హిందీలో రీమేక్ చేయడం ద్వారా లారెన్స్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ముని సీరిస్ లారెన్స్ కు చాలా వరకూ కలిసి వచ్చింది. ఇప్పటికే తమిళంలో ఆ సీరిస్ లో నాలుగు సినిమాలు వచ్చాయి. అవన్నీ తెలుగులోకి అనువాదం అయ్యి తమిళంతో సమానమైన విజయాన్ని సాధించాయి.

ఇక లారెన్స్ బాలీవుడ్ ఎంట్రీకి కూడా ఆ సీరిస్ లోని సినిమానే ఉపయోగపడుతూ ఉంది. ‘కాంచన’ సినిమాను లారెన్స్ హిందీలో రూపొందిస్తూ ఉన్నాడు. అక్షయ్ కుమార్ హీరోగా ఆ సినిమా ఇటీవలే ప్రారంభం అయ్యింది. అయితే ఆ సినిమా నిర్మాతలు తనను అవమానించారంటూ ఇటీవల ఆ సినిమా నుంచి తను వైదొలుగుతున్నట్టుగా ప్రకటించుకున్నాడు లారెన్స్.

ఆ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా తన ప్రమేయం లేకుండా విడుదల చేశారని అంటూ లారెన్స్ దర్శకత్వ బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఆ విషయాన్ని అతడే ప్రకటించాడు.

తన ప్రమేయం లేకుండా ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారని లారెన్స్ అప్పుడు చెప్పాడు. తను ఆ సినిమా నుంచి వైదొలుగుతున్నట్టుగా, అయితే స్క్రిప్ట్ ను మాత్రం అప్పగించేస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే ఇప్పుడు లారెన్స్ మరో ప్రకటన చేశాడు.

తను ఆ సినిమా కోసం పని చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఆ సినిమా హీరో అక్షయ్ కుమార్ తో మాట్లాడినట్టుగా, మొత్తం వివాదం పరిష్కారం అయినట్టుగా.. ‘లక్ష్మీ బాంబ్’ సినిమాకు తనే దర్శకత్వం వహించబోతున్నట్టుగా లారెన్స్ ప్రకటించాడు.