Home రాజకీయాలు జగన్ ఎవరి ఆశలను నెరవేర్చబోతున్నారు?

జగన్ ఎవరి ఆశలను నెరవేర్చబోతున్నారు?

SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల కోసం గట్టి పోటీ కనిపిస్తూ ఉంది. ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది ఆశావహులు కనిపిస్తూ ఉన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మెజారిటీ ఎమ్మెల్యేలు నెగ్గిన సంగతి తెలిసిందే. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ల్యాండ్ స్లైడ్ విక్టరీని సాధించింది. ఏకంగా నూటా యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీ తరఫున నెగ్గారు.

ఇప్పుడు వారిలో చాలా మంది మంత్రి పదవులను ఆశిస్తూ ఉన్నారు. వారిలో జగన్ ఎవరికి న్యాయం చేస్తారు? ఎవరి ఆశలను నెరవేర్చబోతున్నారు? అనేది ఆసక్తిదాయకంగా మారింది.

ప్రస్తుతానికి జగన్ మోహన్ రెడ్డి కేబినెట్లోకి కేవలం పదిహేను మందిని మాత్రమే తీసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. పదిహేను మంది అంటే తక్కువే. ఏపీ కేబినెట్లోకి కనీసం ఇరవై ఐదు మందిని తీసుకునే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం కేవలం పదిహేను మందిని మాత్రమే ఇప్పుడు తన కేబినెట్లోకి తీసుకుంటున్నారట.

నూటా యాభై మంది ఎమ్మెల్యేలకు గానూ.. పదిహేను మందిని జగన్ కేబినెట్లోకి తీసుకుంటున్నారంటే.. ప్రతి పదిమందిలో ఒకరికి ఛాన్స్ లభిస్తున్నట్టు. అయితే ఆశావహుల సంఖ్య మాత్రం గట్టిగా ఉంది.

దాదాపు నలభై మంది ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవి ఖాయమనే ధీమాతో కనిపిస్తూ ఉన్నారు. ఈ మేరకు వాళ్లంతా జగన్ కు విన్నవించుకుని ఉన్నారు. గత పర్యాయం ఎమ్మెల్యేలుగా నెగ్గిన చాలా మంది ఇప్పుడు

మంత్రి పదవులను ఆశిస్తున్నారు. జగన్ నే నమ్ముకుని ఉన్నామని తమకు పదవిని ఇవ్వాలంటూ వారంతా వ్యక్తిగతంగా జగన్ ను కలిసి విన్నపాలు చేసుకుంటూ ఉన్నారు.

ఈ నేఫథ్యంలో జూన్ ఆరో తేదీన జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. మరి మొత్తానికి జగన్ కేబినెట్లో చోటును సంపాదించేది ఎవరెవరో!