Home సినిమా మహేశ్ తదుపరి సినిమా టైటిల్ ఫిక్స్!

మహేశ్ తదుపరి సినిమా టైటిల్ ఫిక్స్!

SHARE

ఇటీవలే ‘మహర్షి’ సినిమాతో మిశ్రమ ఫలితాన్ని పొందిన మహేశ్ బాబు తదుపరి సినిమాకు రంగం సిద్ధం అయ్యింది. ముందుగా ప్రకటించినట్టుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు సినిమా ప్రారంభం అయ్యింది. మహేశ్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ప్రారంభం అయ్యింది. ఈ సినిమా ప్రారంభం రోజున మహేశ్ బాబు లేకపోవడం విశేషం.

ఇది వరకూ మహేశ్ బాబు తన సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనకపోతే ఆ సినిమాలు హిట్ అయ్యాయట. అందుకు సంబంధించిన సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో మహేశ్ బాబు పాల్గొన లేదని తెలుస్తోంది. ఈ సినిమాకు ఒక పాత సూపర్ హిట్ పాట పల్లవిని టైటిల్ గా పెట్టారు.

‘సరిలేరు నీకెవ్వరూ’ అనేది ఈ సినిమా టైటిల్. మహేశ్ బాబు సినిమాకు ఇది వెరైటీ టైటిలే అని చెప్పవచ్చు. సీరియస్ టైటిల్ కాకుండా సరదాగా హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ఉంది ఈ టైటిల్. పేరుకు తగ్గట్టుగా ఇదిసరదా సినిమా అనే విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు.

ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని అనుకుంటున్నారట రూపకర్తలు. ఈ ఏడాది సంక్రాంతికి ‘ఎఫ్ టు’ తో అనిల్ రావిపూడి హిట్ ను సొంతం చేసుకున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి మహేశ్ సినిమాతో ఆ దర్శకుడు రెడీ అవుతున్నట్టున్నాడు.