Home ప్రత్యేకం సీఎం జగన్ మోహన్ రెడ్డి కొత్త చరిత్రను సృష్టించారు!

సీఎం జగన్ మోహన్ రెడ్డి కొత్త చరిత్రను సృష్టించారు!

SHARE

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీ ప్రజలు ఇచ్చిన సంచలన తీర్పుతో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. భారీ మెజారిటీని కట్టబెట్టి జగన్ కు సీఎంగా ఛాన్స్ ఇచ్చారు ఏపీ ప్రజలు. ‘ప్రజల తీర్పు మేరకు ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నా..’ అని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. అభిమానుల ఆనందోత్సవాలు కేరింతల మధ్యన జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్య క్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తమిళనాడు నేత-డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ లు ముఖ్య అతిథులుగా వచ్చారు.

తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, బీజేపీ నేత సోమూ వీర్రాజు, ఇతర రాజకీయ ప్రముఖులు జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. వారందరూ జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జగన్ తల్లి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, ఆయన భార్య భారతి, సోదరి షర్మిల, జగన్ కూతుళ్లు.. తదితర కుటుంబీకులంతా పాల్గొన్నారు.
ఇది వరకూ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవాల సందర్భంలో వైఎస్ కుటుంబం మెరిసింది. ఇప్పుడు జగన్ ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో వారి కుటుంబం ఉత్సాహవంతంగా కనిపించింది.

ఇంత వరకూ ఏపీ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తనయుడు కూడా ముఖ్యమంత్రి అయిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఆ బాధ్యతలు చేపట్టి జగన్ మోహన్ రెడ్డి కొత్త చరిత్రను సృష్టించారు.