Home రాజకీయాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కేబినెట్లోకి చేరనుందా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కేబినెట్లోకి చేరనుందా?

SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని ఎన్డీయే సర్కారులో భాగస్వామి అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని జగన్ మోహన్ రెడ్డి ఎన్డీయేలో చేరే అవకాశాలున్నాయని సమాచారం. ఎన్డీయేలోకి చేరడం ద్వారా మూడు మంత్రి పదవులు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతూ ఉంది.

జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడు ఈ అంశంలో చర్చలు జరిగాయని.. ఆ చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని, వాటి ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కేబినెట్లోకి చేరే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కేంద్రంలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. సింగిల్ గానే భారీ మెజారిటీని సాధించింది భారతీయ జనతా పార్టీ. ఎన్నికల్లో తమతో కలిసి పోటీ చేసిన పార్టీల అవసరం కూడా లేకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు.

అయితే మోడీ మాత్రం అలా సోలోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అంత సానుకూలంగా లేరు. ఈ నేపథ్యంలో ఎన్డీయే రూపంలోనే మళ్లీ ప్రభుత్వం ఏర్పడనుంది. అందులో వైఎస్ఆర్సీపీని కూడా కలుపుకుపోవడానికి బీజేపీ సానుకూలంగా ఉందట. వైఎస్ జగన్ ఓకే చెబితే కేంద్రంలో ఆయన పార్టీ కూడా ప్రభుత్వంలో భాగస్వామి అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జగన్ అందుకు సానుకూలంగా స్పందించే అవకాశాలున్నాయనే మాట కూడా వినిపిస్తూ ఉంది.