Home రాజకీయాలు నాయకుడిగా.. జగన్ ఎంతో హుందాగా..!

నాయకుడిగా.. జగన్ ఎంతో హుందాగా..!

SHARE

తనకు భారీ మెజారిటీని కట్టబెట్టి, తన పార్టీకి తిరుగులేని మెజారిటీని ఇచ్చి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇలాంటి తరుణంలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా అహంభావాన్ని వ్యక్తం చేయకపోవడం గమనించాల్సిన అంశం. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలన్నట్టుగా జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారు.

ఫలితాలు వెల్లడి అయిన దగ్గర నుంచి జగన్ స్పందిస్తున్న తీరు చాలా హుందాగా ఉంది. ఎక్కడా అహంకారంతో మాట్లాడటం లేదు. జరిగిన పరిణామాల గురించి ఎన్నికల్లో గెలుపు గురించి కూడా జగన్ పొంగిపోయి మాట్లాడటం లేదు. ప్రజలు తమను ఎన్నుకున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తమ ముందున్న పని అని జగన్ చెబుతున్నారు.

ఎవరి మీదా కక్ష సాధింపు చర్యలను చేపట్టే ఉద్దేశం తమకు లేదని జగన్ స్పష్టత ఇస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే తమకు ముఖ్యమని అందుకోసమే పాటు పడతామని జగన్ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.కేంద్రంలో ప్రభుత్వంతో కూడా కయ్యం పెట్టుకునే ఉద్దేశం లేదని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం సహకరించమని కోరడం మాత్రమే తమ పని అని జగన్ స్పష్టం చేస్తున్నారు.

అలాగే తన ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా జగన్ మోహన్ రెడ్డి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడను కూడా జగన్ స్వయంగా ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారోత్సవం వేదికను, సమయాన్ని చెప్పి.. ఆ కార్యక్రమానికి రావాలని జగన్ ఆయనను ఆహ్వానించినట్టుగా సమాచారం.