Home సినిమా మహర్షి.. కొన్ని చోట్ల హిట్, కొన్ని చోట్లా ప్లాప్!

మహర్షి.. కొన్ని చోట్ల హిట్, కొన్ని చోట్లా ప్లాప్!

SHARE

ఆఖరికి సినిమా ఫలితాలు కూడా ప్రాంతాల వారీగా మారిపోతూ ఉన్నట్టున్నాయి. ప్రత్యేకించి స్టార్ హీరోల సినిమాలకు ఇలాంటి ఫలితాలు ఎదురవుతున్నాయి. మహేశ్ బాబు తాజా సినిమా ‘మహర్షి’ విషయంలో ట్రేడ్ వర్గాలు ఈ విషయాన్ని చెబుఊత ఉన్నాయి. ట్రేడ్ వర్గాలు ‘మహర్షి’ వసూళ్ల గురించి ఇస్తున్న సమాచారం ప్రకారం చూస్తే.. ఈ సినిమా కొన్ని చోట్ల ప్లాప్, మరి కొన్ని చోట్ల హిట్ అని చెప్పాల్సి ఉంటుందని ట్రేడ్ ఎనలిస్టులు అంటున్నారు.

‘మహర్షి’ సినిమా నైజాంలో రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. ఈ సినిమా అక్కడ తాజాగా ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల వసూళ్ల మార్కును దాటినట్టుగా సమాచారం. షేర్ వసూళ్లలో ‘మహర్షి’ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల వసూళ్ల మార్కును అధిగమించింది. ఇది నైజాం వరకూ రికార్డే.

నాన్ బహుబలి రికార్డు. ఇది వరకూ రామ్ చరణ్ సినిమా ‘రంగస్థలం’ నైజాంలో ఇరవై ఏడు కోట్ల రూపాయల స్థాయి వసూళ్లను సాధించింది. దాన్ని అధిగమిస్తూ మహర్షి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల షేర్ వసూళ్లను సాధించింది. అలా కొత్త రికార్డు సాధించుకుంది.

అయితే ఇదే సినిమా కొన్ని ప్రాంతాల్లో అంత మెరుగైన కలెక్షన్లను సంపాదించుకోలేకపోవడం గమనార్హం. ఈ సినిమా యూఎస్ లో డిస్ట్రిబ్యూటర్లకు న్యాయం చేయలేకపోయిందట. అలాగే సీడెడ్ ప్రాంతంలో కూడా ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పలేదని తెలుస్తోంది. ఏతావాతా.. మహేశ్ సినిమా ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఫలితాన్ని నమోదు చేసినట్టుగా ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.