Home రాజకీయాలు ఏపీ జనహృదయ విజేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ఏపీ జనహృదయ విజేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

SHARE

గత పర్యాయమే దక్కాల్సిన విజయం కాస్త లేట్ అయ్యింది. పచ్చ మీడియా ప్రచారం చేసిన అపోహలు, చంద్రబాబు నాయుడి మాయమాటలు, పవన్ కల్యాణ్ గారడీలు అప్పుడు వర్కవుట్ అయ్యాయి. అయితే ఒకసారి మోసపోతారు.. ప్రజలు ప్రతి సారీ మోసపోరు! అందుకు నిదర్శనంగా నిలుస్తూ వున్నాయి ఏపీ ఎన్నికల ఫలితాలు.

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీని సాధించింది. ఏకంగా నూటా యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాబోతూ ఉన్నారు. తద్వారా ముఖ్యమంత్రి అవుతున్న తొలి ముఖ్యమంత్రి తనయుడిగా వైఎస్ జగన్ నిలవబోతూ ఉన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు ఏపీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. వచ్చే గురువారం జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడ వేదికగానే వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుందని తెలుస్తోంది.

సుదీర్ఘ పాదయాత్రలో ఏపీ ప్రజల్లో నమ్మకం కలిగించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆ నమ్మకాన్ని ఓట్లుగా మార్చుకోవడంలో కూడా పూర్తిగా విజయవంతం అయ్యారు. తమకు ల్యాండ్ స్లైడ్ విక్టరీ దక్కుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పోలింగ్ రోజే అంచనా వేశారు. కౌంటింగ్ రోజుకు అవే అంచనాలు నిజం అయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

కేవలం ఇరవై మూడు అసెంబ్లీ సీట్లకు పరిమితం అయ్యి తెలుగుదేశం పార్టీ చతికిల పడింది. తన ఐదేళ్ల పాలనతో ప్రజలను తీవ్రంగా విసిగించినచంద్రబాబు నాయుడుకు చివరకు ఆ ప్రతిఫలం దక్కింది. ఇక కింగ్ అవుతా, కింగ్ మేకర్ అవుతా అంటూ .. హడావుడి చేసిన పవన్ కల్యాణ్ అడ్రస్ లేకుండా పోయారు. కనీసం తను ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయారాయన. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కల్యాణ్ రెండో చోట్లా ఓడారు. ఒక చోట మూడో స్థానంలో నిలిచారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెజిస్ట్లేటివ్ మీటింగ్ శుక్రవారమే జరగుతూ ఉంది. అక్కడ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని లెజిస్ట్లేటివ్ విభాగం అధిపతిగా ఎన్నుకోనున్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు. శనివారం గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేయనున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.