Home ప్రత్యేకం అది వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలకే సాధ్యం!

అది వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలకే సాధ్యం!

SHARE

ల్యాండ్ స్లైడ్ విక్టరీలు సాధించడం.. ఏపీ చరిత్రలో గత రెండు దశాబ్దాల్లో కేవలం వైఎస్ కుటుంబానికే సాధ్యం అవుతూ ఉన్నాయి. పదిహేనేళ్ల కిందట రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభంజనం కనిపించింది. అది కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు గెలిపించింది. అయితే రెండో పర్యాయం ముఖ్యమంత్రి కాగానే వైఎస్ రాజశేఖర రెడ్డి భౌతికంగా దూరం అయ్యారు. భౌతికంగా లేకపోయినప్పటికీ తెలుగు ప్రజల హృదయాల్లో వైఎస్సార్ కొలువయ్యారు.

ఇప్పుడు అదే స్థాయిలో ప్రజల ఆదరణను పొందారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. నూటా డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు మిగిలిన ఏపీలో నూటా యాభై ఒక్క సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. వైఎస్ జగన్ ప్రభంజనంలో తెలుగుదేశం పార్టీ చిత్తు అయ్యింది. కేవలం ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లకు పరిమితం అయ్యింది.

సినీ గ్లామర్ ను నమ్ముకుని వచ్చిన పవన్ కల్యాణ్ కూడా జగన్ప ప్రభంజనంలో కొట్టుకుపోయారు. కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయాడు పవన్ కల్యాణ్. గాజువాకలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీని సాధించగా.. పవన్ కల్యాణ్ కేవలం మూడో స్థానానికే పరిమితం అయ్యాడు.

ఏపీ చరిత్రలో ఏనాడూ ఒక ముఖ్యమంత్రి తనయుడు ముఖ్యమంత్రి కాలేదు. చాలా మంది ముఖ్యమంత్రుల తనయులు రాజకీయాల్లోకి వచ్చి హల్చల్ చేయడానికి ప్రయత్నించారు. అయితే వారెవరికీ అంత సీన్ లేకపోయింది. ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడికే ముఖ్యమంత్రి యోగం కలుగుతోంది. ప్రజల విశ్వాసంతో జగన్ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నారు.