Home సినిమా ‘ఓ బేబీ’ ఫస్ట్ లుక్.. స్మైలీ సమంత, ఇంట్రస్టింగ్!

‘ఓ బేబీ’ ఫస్ట్ లుక్.. స్మైలీ సమంత, ఇంట్రస్టింగ్!

SHARE

ఒక డెబ్బై యేళ్ల వృద్ధురాలు హఠాత్తుగా ఒక ఇరవై యేళ్ల అమ్మాయి శరీరంలోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుందనే ఒక వెరైటీ కాన్సెప్ట్ తో రూపొందించారట ‘ఓ బేబీ’ సినిమాను. దర్శకురాలు నందినీ రెడ్డి ఈ సినిమాను రూపొందించారు. సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన ఫస్ట్ లుక్ ఆసక్తిదాయకంగా ఉంది.

స్మైలీ సమంత ఈ పోస్టర్ లో కనిపిస్తూ ఉండగా, వెనుక వైపున లక్ష్మి కనిపిస్తూ ఉన్నారు. వృద్ధురాలి పాత్రను లక్ష్మి చేస్తుండగా, యువతి పాత్రను సమంత చేస్తోందని స్పష్టం అవుతోంది.

వెరైటీగా సినిమాలు చేసుకొంటూ వెళ్తోంది నందినీ రెడ్డి. సరదాగా, యువత బాగా ఓన్ చేసుకునే కథలతో ఆమె విజయాలను సొంతం చేసుకుంది. ‘అలా మొదలైంది’ సినిమాతో కెరీర్ ను అలా మొదలుపెట్టిన నందినీ రెడ్డి ఆ తర్వాత తీసింది తక్కువ సినిమాలే అయినా తన ప్రత్యేకతను నిరూపించుకుంటూ ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో వెరైటీ కాన్సెప్ట్ తో వస్తోందామె.

మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. దాదాపు గా షూటింగ్ పూర్తి అయినట్టుగా సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ ఉందట. జూలైలో ఈ సినిమాను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.