Home Uncategorized ఇంధనరంగంలో ఎంఈఐఎల్‌ అంతర్జాతీయ ప్రాజెక్టులు

ఇంధనరంగంలో ఎంఈఐఎల్‌ అంతర్జాతీయ ప్రాజెక్టులు

SHARE

మేఘా ఇంజనీరింగ్ & ఇంఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్‌) జాతీయ‌, అంతర్జాతీయ స్థాయిలో హైడ్రో కార్బన్స్‌ రంగంలో అనేక ప్రాజెక్ట్లను విజయవంతంగా పూర్తిచేసింది. జోర్డాన్‌లో 54 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 2018 అక్టోబర్లో ఎంఈఐఎల్ ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేసి విద్యత్ ఉత్పత్తిని ప్రారంభించింది. విదేశాలలో ఎంఈఐఎల్ చేపట్టిన మరో ప్రాజెక్ట్ కువైట్‌లోని ఆల్ జౌరీ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్. 66 చమురు స్టోరేజ్ ట్యాంకులను నిర్మించే ప్రాజెక్టును ఎంఈఐఎల్ కువైట్లో చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ కోసం 3000 మంది ఎంఈఐఎల్ సిబ్బంది పనిచేస్తున్నారు. కోటి పని గంటల పాటు ఎలాంటి ప్రమాదాలు జరగనందుకు కెఐపీఐసీ నుండి ఎంఈఐఎల్ ప్రశంసా పత్రం అందుకుంది.

అస్సాంలో ఎంఈఐఎల్ ప్రాజెక్టులు:
అస్సాంలోని ఓఎన్‌జీసికి చెందిన ఆరు పైపులను పునర్ నిర్మించే ప్రాజెక్ట్ను ఎంఈఐఎల్ దక్కించుకుని విజయవంతంగా పూర్తిచేసింది. 5 సెగ్మెంట్లలో 128.3 కిలోమీటర్ల మేర పైప్లైన్, ఒక సెగ్మెంట్లో 16.5 కిలోమీటర్ల పైప్లైన్ను ఎంఈఐఎల్ పునర్నిర్మించి ఓఎన్జీసీకి అప్పగించింది. 2017లో ఎంఈఐఎల్ 48.3 కిలోమీటర్ల పైప్లైన్ను ఈ ప్రాజెక్ట్లో పూర్తి చేసింది.
అంతేకాకుండా అసోం పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా వ్యర్థ్య పదార్థాల శుద్ది ప్లాంట్లను ఎంఈఐఎల్ నిర్మించింది. వీటిని ఎంఈఐఎల్ అత్యంత అధునాతన సాంకేతిక పద్ధతులను ఉపయోగించి నిర్మించింది. ఇక్కడి నుంచి ప్రధానంగా పర్యావరణానికి హాని కలిగించని విధంగా ఉత్పత్తులు ప్రాసెస్ చేసి తదనంతరం నిల్వ, సరఫరాకు అవసరమైన నిర్మాణాలు జరిగాయి.

రాజస్థాన్లో రాగేశ్వరి గ్యాస్ టెర్మినల్ ప్లాంట్:
రాజస్థాన్లోని రాగేశ్వరి వద్ద గ్యాస్ టెర్మినల్ ప్లాంట్ను 6 నెలల్లోనే పూర్తి చేసింది ఎంఈఐఎల్. ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఒక సవాలుగా తీసుకుని 2018 సెప్టెంబర్ నెలలో పనులు మొదలుపెట్టి మార్చి 2019 నాటికి ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో రికార్డ్ సమయంలో పూర్తి చేసింది. ఇక్కడ 90 ఎంఎంఎస్ఎఫ్డి సామర్థ్యం గల ఆయిల్, గ్యాస్ ప్రాసెసింగ్ యూనిట్లను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్ ఆపరేషన్, మెయింటెనెన్స్ పనులను ఎంఈఐఎల్ 18 నెలల పాటు చూడనుంది.

గుజరాత్‌లోని మెహసనలో 4 భాగాలుగా అగ్నిమాపక వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రాజెక్ట్ను ఎంఈఐఎల్ దక్కించుకుని పూర్తి చేసింది. ఇందులో కొత్తగా అగ్నిమాపక వ్యవస్థ నిర్మాణం, హైడ్రాన్ట్స్, వాటర్, ఫోమ్ మానిటర్లు, హెచ్వీఎల్ఆర్, నీటి స్ప్రిక్లర్ సిస్టం సహా మెహసానలో ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో గ్యాస్ గ్రిడ్ నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి ఎంఈఐఎల్ నాగయలాంక, పశ్చిమ పెనుగొండ ప్రాంతాల్లో ఓఎన్జీసీ నుంచి ఆన్షోర్ గ్యాస్ క్షేత్రాలను దక్కించుకుంది. ఈ క్షేత్రాల నుండి రోజుకు 130000 ఎస్సీఎమ్ గ్యాస్ను తరలించేలా ఏర్పాటు చేసింది. నాగాయలంక క్షేత్రాన్ని ఇప్పటికే ప్రారంభించి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఎంఈఐఎల్ గ్యాస్ను పంపిణీ చేస్తోంది. అలాగే తెలంగాణాలో పరిశ్రమలకు కూడా అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నది. పశ్చిమ పెనుగొండ గ్యాస్ ప్రాజెక్టు కూడా పూర్తయింది.

సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టులో భాగంగా మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని 16 జిల్లాలను ఎంఈఐఎల్ దక్కించుకుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, కర్ణాటకలోని తుంకూరు, బెలగావి జిల్లాల్లో గృహ, వాణిజ్య, పారిశ్రామిక, ఆటోమొబైల్ రంగాలకు గ్యాస్ ను సరఫరా చేస్తున్నది. తెలంగాణ లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగాం, మహబూబాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ జిల్లాల్లో సీజీడీ నెట్ వర్క్ ను ఎంఈఐఎల్ ఏర్పాటు చేయనున్నది.