Home రాజకీయాలు ఎగ్జిట్ పోల్స్ పై అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు!

ఎగ్జిట్ పోల్స్ పై అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు!

SHARE

ఎగ్జిట్ పోల్స్ విషయంలో తను చేస్తున్న కామెంట్లతో వార్తల్లో నిలుస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఎగ్జిట్ పోల్స్ గురించి గత కొన్నాళ్లుగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వస్తున్నారు. తన పార్టీ వాళ్లతో వాటి మీద మాట్లాడుతూ.. వాటిని నమ్మకూడదని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. వాటిని చూసి ఎవరూ భయాందోళనలకు గురి కావొద్దని చంద్రబాబు నాయుడు అవి విడుదల కాకముందే చెప్పుకొచ్చారు!

ఎగ్జిట్ పోల్స్ అన్నీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే వస్తాయని చంద్రబాబు నాయుడు అప్పుడే తేల్చేశారు. ఎగ్జిట్ పోల్స్ అబద్ధాలు అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఎగ్జిట్ పోల్స్ ఎలాగూ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వస్తాయని తెలుసుకుని చంద్రబాబు నాయుడు అప్పుడు మాట మాట్లాడారని విశ్లేషకులు అప్పుడే తేల్చారు. ఇక మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఎలాగూ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే వచ్చాయి. కాబట్టి ఇప్పుడు కూడా వాటిని నమ్మొద్దని చంద్రబాబు నాయుడు అంటున్నారు.

ఎగ్జిట్ పోల్స్ అబద్ధాలు అని, అవి ప్రజల నాడిని సరిగా పట్టలేదని చంద్రబాబు నాయుడు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు బాబు ఇలా మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయన గతంలో ఎగ్జిట్ పోల్స్ విషయంలో స్పందించిన తీరును గుర్తు చేస్తున్నారు నెటిజన్లు.

గత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అయ్యాకా ఎగ్జిట్ పోల్స్ విడుదల అయినప్పుడు చంద్రబాబు నాయుడు ఏమని స్పందించారో పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అప్పుడు కాంగ్రెస్ ఓడుతుందని, ఎన్డీయేకు అధికారం దక్కుతుందని, ఏపీలో తెలుగుదేశం పార్టీ నెగ్గుతుందని వచ్చిన ఎగ్జిట్ పోల్స్ పై చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు. ఎగ్జిట్ పోల్స్ వాస్తవాలు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు అప్పుడు చెప్పుకొచ్చారు.

గెలుపు అవకాశాలు తమకు ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పుడేమో చంద్రబాబు నాయుడు అలా మాట్లాడారు, ఇప్పుడు వాళ్ల పార్టీ చిత్తు అవుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తూ ఉండటంతో వాటిని నమ్మొద్దని చంద్రబాబు చెప్పుకుంటున్నాడు. ఇదీ చంద్రబాబు తీరు అని విశ్లేషకులు అంటున్నారు.