Home ప్రత్యేకం ఎగ్జిల్ పోల్స్: ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం!

ఎగ్జిల్ పోల్స్: ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం!

SHARE

సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం లాంటి విజయాన్ని సాధిస్తుందని అంచనా వేశాయి వివిధ ఎగ్జిట్ పోల్స్. దేశవ్యాప్తంగా లోక్ సభ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో వరసగా వివిధ వార్తా సంస్థల ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. ఏపీ వరకూ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ప్రిడిక్ట్ చేశాయి.

-ఇండియాటుడే ఎగ్జిట్ పోల్ సర్వేలో ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రభంజనం లాంటి విజయం సాధిస్తుందని తేలింది. ఎంపీ సీట్ల విషయంలో వైఎస్ఆర్సీపీ 18 నుంచి 20 వరకూ సీట్లను సాధిస్తుందని, అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే వైఎస్సార్సీపీకి 130 నుంచి 133 సీట్ల వరకూ దక్కే అవకాశం ఉందని ఇండియాటుడే తేల్చింది.

-టైమ్స్ నౌ సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో 18 వరకూ ఎంపీ సీట్లను సాధించే అవకాశం ఉందని తేలింది.

-సీపీఎస్ సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ అసెంబ్లీకి సంబంధించి 133 సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

-ఆరా ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని తేలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇరవై నాలుగు వరకూ ఎంపీ సీట్లను సాధించే అవకాశం ఉందని ‘ఆరా’ పేర్కొనడం విశేషం.

-ఇంకా వివిధ జాతీయ స్థాయి మీడియా సంస్థలు కూడా ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎంపీ సీట్లను సాధించే అవకాశాలున్నాయని తమ ఎగ్జిట్ పోల్స్ లో ప్రకటించాయి.

-ఒక్క లగడపాటి సర్వే మాత్రం తెలుగుదేశం పార్టీ పక్షాన నిలిచింది. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపడుతుందని లగడపాటి ప్రకటించుకొచ్చారు. అయితే తనది సర్వే కాదు అని, అంచనా అని ఆయన చెప్పుకొచ్చారు.

-మెజారిటీ ఎగ్జిట్ పోల్ అంచనాలు ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉందని తేల్చి చెప్పడం విశేషం. కౌంటింగ్ ఈ గురువారం జరగబోతున్న సంగతి తెలిసిందే.