Home రాజకీయాలు లగడపాటి ‘పచ్చ’పాతం.. అసలు విషయం అదా?

లగడపాటి ‘పచ్చ’పాతం.. అసలు విషయం అదా?

SHARE

లగడపాటి ఏ రోజో పచ్చముసుగు వేసుకున్నాడు. ఇక అతడి నుంచి కొత్తగా ఎక్స్ పెక్ట్ చేసేది ఏముంటుంది? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయంలో లగడపాటి చెప్పిన మాటలు అందరికీ తెలిసినవే. పక్కా పచ్చ పార్టీ కార్యకర్తలా మాట్లాడాడు. చంద్రబాబుతో సమావేశాలు పెట్టి.. పోలింగ్ కు ముందే తెలంగాణ రాష్ట్ర సమితిని దెబ్బతీసే ప్రణాళికను అమలు పెట్టే ప్రయత్నం చేశాడాయన.

తెలంగాణలో టీఆర్ఎస్ చిత్తుగా ఓడుతుందని.. ఆఖరికి ఇండిపెండెంట్లు గెలుస్తారని..ఏదేదో చెప్పుకొచ్చాడు లగడపాటి. పోలింగ్ కు ముందే అలా మాట్లాడి తెలంగాణ రాష్ట్ర సమితిని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. అయితే ఆ ప్రయత్నంలో బొక్కబోర్లా పడ్డాడు. ఇక పోలింగ్ అనంతరం కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటమి తప్పదంటూ..మహాకూటమికి అధికారం దక్కుతుందంటూ.. మాట్లాడాడు. ఆ జోస్యం ఏమైందో అందరికీ తెలిసిందే! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పక్కా తెలుగుదేశం కార్యకర్తలా మాట్లాడాడు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు చంద్రబాబుకు మరింత సన్నిహితుడు అయ్యాడీయన. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏం మాట్లాడతాడో అంచనా వేయడం కష్టం కాదు.

రేపటి వరకూ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడానికి వీల్లేదని ఎన్నికల నియమావళి ఉన్నా లగడపాటి ఈ రోజే వచ్చి తెలుగుదేశం పార్టీ అనుకూల మాటలు మాట్లాడాడు. దీనికంతా కారణం ఏమిటి? అంటే.. రీపోలింగ్ ను ప్రభావితం చేసే ప్రయత్నంగా సాగుతోంది. రేపు చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రీ పోలింగ్ ఉంది.

ఇలాంటి నేపథ్యంలో.. తెలుగుదేశం రాబోతోంది అంటూ అక్కడి జనాలను బెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా పోలింగ్ కు ముందు రోజున లగడపాటి ప్రెస్ మీట్ అంటూ ‘పచ్చ’పాతాన్ని చూపించాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లగడపాటి ఏపీ విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని అనడాన్ని బట్టి.. తెలంగాణ ఫలితాల్లో తెలుగుదేశం ఆధ్వర్యంలోని కూటమి చిత్తు అయినట్టుగా.. ఏపీలో కూడా టీడీపీ చిత్తు కావడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.