Home సినిమా తన పేరును గూగుల్ లో సెర్చ్ చేసుకోవడం మానేసిందట!

తన పేరును గూగుల్ లో సెర్చ్ చేసుకోవడం మానేసిందట!

SHARE

తను ఇచ్చిన హాట్ పోజుల పట్ల తనే అయిష్టతను చూపిస్తోంది అదితీరావ్ హైదరీ. ఈ నటి ఒక ఫొటో షూట్ కు హాట్ హాట్ పోజులను ఇచ్చింది. సెమీ న్యూడ్ గా కనిపించింది. తన వీపును చూపుతూ అర్ధనగ్నంగా పోజులు ఇచ్చింది. ఆ హాట్ పోజులు వైరల్ గా మారాయి. అవి ఎంత పాపులర్ అయ్యాయంటే.. గూగుల్ తో అదితీరావ్ హైదరీ పేరును సెర్చ్ చేస్తూ ఉంటే.. ఆ ఫొటోలనే సెర్చ్ రిజల్ట్స్ లో ముందు వస్తున్నాయట!

ఈ విషయాన్ని చెప్పుకునే వాపోయింది అదితీ. తను పొరపాటు చేసినట్టుగా ఈమె డైరెక్టుగా చెప్పడం లేదు కానీ. ఆ ఫొటోల ధాటికి తను తన పేరును గూగుల్ లో సెర్చ్ చేసుకోవడం మానేసినట్టుగా అదితీ రావ్ చెప్పుకొచ్చింది. తన పేరును గూగుల్ లో సెర్చ్ చేయగానే ఆ ఫొటోలే వస్తున్నాయని ఈమె వాపోతోంది.

ఆ సెమీ న్యూడ్ పోజుల్లో తనను తాను చూసుకోలేక పదే పదే ఆ ఫొటోలు కనిపిస్తుంటే తట్టుకోలేక ఆఖరికి తన పేరును తను గూగుల్ సెర్చ్ లో టైప్ చేయడం మానేసినట్టుగా అదితీరావ్ హైదరీ వింరించింది.

మరి సెమీ న్యూడ్ పోజులు ఇచ్చిన హీరోయిన్లు వాటి గురించి పునరాలోచిస్తే ఇలాగే ఉంటుంది పరిస్థితి అని చెప్పవచ్చు. చాలా మంది నటీమణులు ఒకసారి పోజులు ఇచ్చాకా వాటి గురించి ఆలోచినట్టుగా కనిపించరు. ఆలోచిస్తే అదితీలా ఇబ్బంది పడాల్సి వస్తుందేమో!