Home సినిమా మహేశ్ బాబు ఆ దర్శకుడితో ఒక సినిమాకు ఓకే?

మహేశ్ బాబు ఆ దర్శకుడితో ఒక సినిమాకు ఓకే?

SHARE

‘మహర్షి’ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో కనిపిస్తూ ఉన్నాడు మహేశ్ బాబు. తొలి వారంలో ఈ సినిమా యాభై కోట్ల రూపాయలకు పైగా షేర్ ను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దాదాపు నూటా ఇరవై కోట్ల రూపాయల మొత్తాన్ని వసూలు చేస్తే ఈ సినిమా హిట్ కింద పరిగణనలోకి వస్తుందని అంటున్నారు. తొలి వారంలోనే ఈ సినిమాకు యాభై కోట్ల రూపాయలకు పై స్థాయిలో షేర్ రావడం సానుకూలాంశం అని అంటున్నారు.

ఈ సినిమా వసూళ్లకు ఇంకా స్కోప్ ఉంది. వేసవి సెలవులు కావడం, పోటీలో భారీ సినిమాలు ఏవీ లేకపోవడంతో మహేశ్ బాబు సినిమాకు మరిన్ని వసూళ్లు దక్కడం ఖాయంగా కనిపిస్తూ ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఏతావాతా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ ను టచ్ చేసే అవకాశాలున్నాయి.

ఈ సినిమా విజయం ఉత్సాహంలో ఉన్న మహేశ్ ఇప్పుడు తదుపరి సినిమాల మీద దృష్టి సారించినట్టుగా సమాచారం. ఇప్పటికే ఎఫ్ టు దర్శకుడితో ఒక సినిమాకు ఓకే చెప్పాడట మహేశ్. ఈ హీరో చేయబోయే తదుపరి సినిమా అదేనని తెలుస్తోంది.

ఇక పరశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి కూడా మహేశ్ ఓకే చెప్పాడని సమాచారం. ‘గీతగోవిందం’ తో సూపర్ హిట్ కొట్టిన ఆ దర్శకుడు ఇప్పటికే మహేశ్ కు కాన్సెప్ట్ చెప్పాడని, ఆ సినిమాను చేయడానికి మహేశ్ ఓకే చెప్పినట్టుగా సినీ వర్గాలు అంటున్నాయి!