Home రాజకీయాలు తుదివిడతలో కాంగ్రెస్‌ బోణీ కొట్టడం కూడా కష్టమే!

తుదివిడతలో కాంగ్రెస్‌ బోణీ కొట్టడం కూడా కష్టమే!

SHARE

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి తుదివిడత సవాల్‌గా మారింది. ఇప్పటి వరకు ఎన్నికలు పూర్తయిన ఆరు విడతల సంగతి పక్కన పెడితే ఏడోవిడత ఎన్నికల్లో కాంగ్రెస్‌ కనీసం ఖాతా కూడా తెరవని పరిస్థితి నెలకొంది. ఈనెల 19వ తేదీ ఏడోవిడతలో ఎనిమిది రాష్ట్రాల్లో 59 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. గత 2014 ఎన్నికల్లో ఈ 59 స్థానాలకు గానూ కాంగ్రెస్‌ కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. కాగా 39, ఇతరులు 16 స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఈసారి కూడా కాంగ్రెస్‌కు ఆయా ప్రాంతాల్లో కష్టంగానే ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎనిమిది రాష్ట్రాలకు గానూ ఏడు నిమిది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఖాతా తెరవలేదు. పంజాబ్‌లో మాత్రం నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఈసారి కూడా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని అంచనా వేస్తున్నారు.

కాంగ్రెస్‌ను మట్టి కరిపించేందుకు బీజేపీ ముమ్మరంగా ప్రచారం చేసింది. ఈమేరకు యూపీలో 13 నియోజకవర్గాల్లో ప్రధాని మోదీ ర్యాలీల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆ 13 స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉంది. ఏడోవిడత ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌ మినహా మిగతా రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉంది. ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. అయితే పంజాబ్‌లో మాత్రం ఆప్, కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి గట్టి పోటీ ఉంటుందని చెబుతున్నారు.

గత 2014 ఫలితాలు
రాష్ట్రం  స్థానాలు ఎన్‌డీయే కాంగ్రెస్‌ ఇతరులు
యూపీ 13 13 00 00
బిహార్‌ 08 07 00 01(జేడీయూ)
చంఢీగఢ్‌ 01 01 00 00
పశ్చిమబెంగాల్‌ 09 00 00 09 (టీఎంసీ)
పంజాబ్‌ 13 05 04 04 (ఆప్‌)
హిమాచల్‌ప్రదేశ్‌ 04 04 00 00
మధ్యప్రదేశ్‌ 08 08 00 00
జార్ఖండ్‌ 03 01 00 02
మొత్తం 59 39 04 16