Home రాజకీయాలు చంద్రబాబు మరో యూటర్న్ తీసుకుంటున్నారా!

చంద్రబాబు మరో యూటర్న్ తీసుకుంటున్నారా!

SHARE

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మరో యూటర్న్ కు రెడీ అయినట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. యూటర్న్ లు తీసుకొంటూ ఎప్పటికప్పుడు అవకాశవాదాన్ని చాటుకోవడంలో చంద్రబాబు నాయుడు నిర్మొహమాటంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రజలు ఏమైనా అనుకుంటారనే లెక్క లేకుండా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తూ ఉంటారు. పదే పదే మాటలు మార్చడం, ఒకసారి చెప్పింది మరోసారి చెప్పుకుండా ప్రజలను ఫూల్స్ చేయడం చంద్రబాబుకు అలవాటే!

ఈ క్రమంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరో యూటర్న్ కు రెడీ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. తిరిగి బీజేపీ వైపు చూడటమే చంద్రబాబు నాయుడి తాజా యూటర్న్ అని విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇన్ని రోజులూ బీజేపీని చంద్రబాబు నాయుడు ఎంతలా విమర్శించాడో అందరికీ తెలిసిందే. భారతీయ జనతా పార్టీ మోసం చేసిందని, ఏపీకి ద్రోహం చేసిందంటూ చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో రెచ్చిపోయి మాట్లాడారు.

తన వైఫల్యాలు అన్నింటికీ బీజేపీని కారణంగా చూపుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల పోరును దాటేశారు. ఎన్నికల్లో గెలుస్తారో లేదో కానీ.. కేంద్రంలో మాత్రం మళ్లీ కమలం పార్టీనే అధికారాన్ని సంపాదించుకునేలా ఉంది. సొంతంగా కాకపోయినా.. ఎన్డీయే రూపంలో బీజేపీనే కేంద్రంలో అధికారాన్ని చేపట్టే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తూ వున్నారు.

చంద్రబాబు నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని సాధించే అవకాశాలు లేవనే అంచనాలే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మళ్లీ బీజేపీ వైపుకు టర్న్ తీసుకుంటున్నారని, అందులో భాగంగా ఆ ఏర్పాట్లు చేయడానికి తన రాజగురువు రామోజీని చంద్రబాబు నాయుడు కలిశాడని ప్రచారం జరుగుతూ ఉంది. ఫలితాలు వచ్చేలోపే చంద్రబాబు నాయుడు ఇలా యూటర్న్ కు రెడీ అయినట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. అవకాశవాదాన్ని చాటుకోవడంలో చంద్రబాబు నాయుడు మరీ తెగించేసి వ్యవహరిస్తూ ఉన్నారు. దీని పర్యవసనాలు ఎలా ఉంటాయో!