Home రాజకీయాలు ‘రవి ప్రకాష్.. అన్ని నీతులు చెప్పావే, పరారీ అయ్యేందుకు సిగ్గులేదా’

‘రవి ప్రకాష్.. అన్ని నీతులు చెప్పావే, పరారీ అయ్యేందుకు సిగ్గులేదా’

SHARE

‘కట్నం తీసుకున్న వాడు గాడిద..’ ‘ఫ్యాక్షనిస్టుల ఆస్తులు జాతీయం చేయాలి..’ ఇవీ రవి ప్రకాష్ సీఈవోగా ఉన్న చానల్ లో ఇన్నాళ్లూ ప్రదర్శితం అయిన నీతులు. ఇలా ఊళ్లో వాళ్లందరికీ నీతులు చెప్పిన రవి ప్రకాష్ ఇప్పుడు తప్పు చేసి పరారీలో ఉన్నాడు. ఆయనపై నమోదు అయిన కేసులకు వివరణ ఇచ్చుకోకుండా.. ఎక్కడో కలుగులో దాక్కున్నాడు.

రవి ప్రకాష్ ఏపీకి వెళ్లి విజయవాడ ప్రాంతంలో తల దాచుకున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. అక్కడికి అయితే తెలంగాణ పోలీసులు వచ్చి తనను అరెస్టు చేయలేరు అనేది ఆయన నమ్మకం కాబోలు. మరి అన్ని నీతులు చెప్పిన రవి ప్రకాష్ ఇలా పరారీలో ఉండటంపై సోషల్ మీడియా విరుచుకుపడుతూ ఉంది.

అన్ని నీతులు చెప్పిన రవి ప్రకాష్ ఇలా ఫోర్ ట్వంటీ కేసులను ఎదుర్కొంటూ పరారీలో ఉండటం పట్ల నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ‘ఆయనకు కొంచెమైనా సిగ్గులేదా’ అంటూ వారు ఘాటుగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ‘ఫ్యాక్షనిస్టుల ఆస్తులు జాతీయం చేయమన్నావు సరే, ఇంతకీ పరారీలో ఉన్న వారి ఆస్తులను ఏం చేయాలి?’ అనే ప్రశ్న కూడా రవి ప్రకాష్ విషయంలో వ్యక్తం అవుతూ ఉంది.

తనపై కేసులు నమోదు అయ్యాకా కూడా రవి ప్రకాష్ చాలా కబుర్లు చెప్పాడు. టీవీ నైన్ తెర మీదకు వచ్చి సవాళ్లు విసిరాడు. అందరికీ మళ్లీ నీతులు చెప్పాడు. ఆ తర్వాత మళ్లీ పరారీలో ఉన్నాడు. ఇదీ ఆయన కథ. నీతులు బయటి వాళ్లకు చెప్పేందుకే అని ఈ మీడియా నడమంత్రపు మనిషి మరోసారి చాటిచెబుతూ ఉన్నాడని సామాన్య ప్రజానీకం అనుకుంటున్నారు.