Home రాజకీయాలు జగన్ తో కాళ్ల బేరం మొదలుపెట్టిన కాంగ్రెస్, బాబుకు షాక్!

జగన్ తో కాళ్ల బేరం మొదలుపెట్టిన కాంగ్రెస్, బాబుకు షాక్!

SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో కాళ్ల బేరాన్ని మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో తమకే మద్దతును ఇవ్వమంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్లు అటు లోపల ఇటు బయట సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టం అవుతోంది.

మొన్నటి వరకూ జగన్ తమకు ప్రత్యర్థి, చంద్రబాబు నాయుడు తమకు స్నేహితుడు అని ప్రకటించుకున్న కాంగ్రెస్ పార్టీ వాళ్లు. ఇప్పుడు మాత్రం మళ్లీ జగన్ వద్దకు కాళ్ల బేరానికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. జగన్ మోహన్ రెడ్డి తమవాడంటూ కాంగ్రెస్ నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తూ ఉండటం గమనార్హం.

ఇప్పటికే జగన్ తో సంధి కుదిర్చే బాధ్యతను కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీకి అప్పగించిందట కాంగ్రెస్ పార్టీ హై కమాండ్. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా ఉన్నారాయన. ఈ నేపథ్యంలో జగన్ తో సంప్రదింపులు జరపాలని.. జగన్ మద్దతు కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమికే దక్కేలా చూడాలని వారు చాందీని ఆదేశించారట. ఈ విషయంలో ఆయన జగన్ తో టచ్లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది.

అయితే జగన్ ఒకే మాటతో సమాధానం ఇచ్చినట్టుగా సమాచారం. ‘ఫలితాలు వచ్చాకా చూద్దాం..’ అంటూ జగన్ కాంగ్రెస్ విన్నపం పట్ల సూటిగా స్పందించినట్టుగా తెలుస్తోంది.
అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఇంతటితో ఆగడం లేదు. ఎలాగైనా జగన్ ను తమవైపు మళ్లించుకోవడానికి వారు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

అందులో భాగంగా ‘జగన్ మా వాడు. మా వైఎస్సార్ తనయుడు..’ అంటూ కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఇలా జగన్ తో కాళ్ల బేరాన్ని సాగిస్తూ ఉన్నారని పరిశీలకులు అంటున్నారు.

మరోవైపు తను కాంగ్రెస్ తో టచ్లో ఉండేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే. కాంగ్రెస్ మాత్రం జగన్ కోసం ట్రై చేస్తూ ఉండటం చంద్రబాబుకు ఝలక్ గా మారింది!