Home రాజకీయాలు మీడియా బలాన్ని పెంచుకుంటున్న వైఎస్సార్సీపీ?

మీడియా బలాన్ని పెంచుకుంటున్న వైఎస్సార్సీపీ?

SHARE

ఒకవైపు ఏపీలో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో వైఎస్సార్సీపీ హవా ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ ఉత్సాహంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ లోటు పాట్లపై దృష్టి పెట్టిందని సమాచారం అందుతోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి మీడియా సపోర్ట్ లేదు. ప్రస్తుతం ఈ అంశం మీదే జగన్ పార్టీ దృష్టి పెట్టిందట. తమ మీడియా బలగాన్ని పెంచుకునేందుకు జగన్ పార్టీ కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం. జగన్ కు సొంత మీడియా సంస్థ అయితే ఉంది. అటు ప్రింట్, ఇటు ఎలక్ట్రానిక్ మీడియా విషయంలో జగన్ కు సొంత మీడియా ఉంది.

అయితే ఒకే మీడియా హౌస్ తో బండి లాగించగలిగే రోజులు కావు ఇవి. జగన్ కు అనుకూలంగా ఒక మీడియా హౌస్ ఉంటే.. వ్యతిరేకంగా బోలెడన్ని మీడియా సంస్థలు పని చేశాయి. అనునిత్యం అవి జగన్ మీద దుష్ప్రచారాలను సాగించడమే పనిగా పెట్టుకుని పని చేశాయి.

రేపు జగన్ పార్టీ అధికారాన్ని చేపడితే మీడియా నుంచి మరింత దాడులను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అందుకే అప్పుడే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే రెండు వార్తా చానళ్లను చేరదీస్తోందట జగన్ పార్టీ.

ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజసాయి రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ లైవ్ స్ట్రీమింగ్ లో ఉన్న రాజ్ న్యూస్ ను ఆయన టేకోవర్ చేస్తున్నారని, అలాగే ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ ను కూడుకునే.. వార్తలను కూడా ప్రజెంట్ చేసే ఒక వార్తా చానల్ ను ఏర్పాటు చేయడానికి కూడా సమాయత్తం అవుతున్నట్టుగా సమాచారం!