Home రాజకీయాలు ఢిల్లీలో కూడా తిరగని చంద్రబాబు చక్రం..!

ఢిల్లీలో కూడా తిరగని చంద్రబాబు చక్రం..!

SHARE

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఈ దఫా ఏపీలో అధికారం కోల్పోవడం ఖాయమనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం తధ్యమనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తూ ఉన్నాయి. ఇలా ఏపీలో తన నుంచి అధికారం చేజారినా కేంద్రంలో పట్టు నిలుపుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు.

అయితే ఏపీలో లోక్ సభ సార్వత్రిక ఎన్నికల విషయంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. లోక్ సభ సీట్ల విషయంలో కూడా తెలుగుదేశం చిత్తు అవుతుందని.. ఆ పార్టీకి దక్కేది మూడు నుంచి ఆరు ఎంపీ సీట్లు మాత్రమే అని వివిధ సర్వేలు ఇప్పటికే పేర్కొన్నాయి.

మరి ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం అధినేత ఆ మాత్రం ఎంపీ సీట్లతో ఏం సాధిస్తారో కానీ.. ఆయన హడావుడి అయితే పీక్స్ లో ఉంది. ప్రధానమంత్రి అభ్యర్థిని తనే డిసైడ్ చేస్తా.. అన్నట్టుగా చంద్రబాబు నాయుడు కలరింగ్ ఇస్తున్నాడు. ఒకవైపు తనకు ప్రధానమంత్రి కావాలని లేదంటూ.. మరోవైపు బీజేపీ వ్యతిరేక పక్షాలు తన మాటే వింటాయన్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకొంటున్నాడు.

అయితే చంద్రబాబు నాయుడుకు ఇలాంటి ప్రచారాలు చేసుకోవడం కొత్త ఏమీ కాదనేది పరిశీలకుల మాట. చంద్రబాబు నాయుడు తన డప్పును తనే వాయించుకొంటూ ఉంటారు. అలా సొంత డబ్బా కొట్టుకుంటే జనాలు నవ్వుతారనే భయం చంద్రబాబుకు ఉండదనేది పరిశీలకుల మాట.

ఈ క్రమంలో బాబు తాజా రాజకీయ పరిణామాల్లో కూడా డప్పు కొట్టుకుంటున్నారని స్పష్టం అవుతోంది. అయితే బాబు చక్రం ఈ సారి ఢిల్లీలో తిరిగే అవకాశం లేదని.. చంద్రబాబుకు వచ్చేది సింగిల్ డిజిట్ స్థాయి ఎంపీ సీట్లే కావడంతో ఆయన చక్రం అక్కడ తిరగదని విశ్లేషకులు అంటున్నారు.

చంద్రబాబు ఆల్రెడీ బీజేపీకి దూరం అయిన నేపథ్యంలో, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నా.. ఆయనకు అక్కడ చోటు దక్కదని, చంద్రబాబుకు రాజకీయ ప్రత్యర్థులు అయిన జగన్, కేసీఆర్ లు ముప్పైకి పైగా ఎంపీ సీట్లను సాధించుకుంటే.. అప్పుడు తెలుగుదేశం అధినేతకు కాంగ్రెస్ కూటమి వద్ద కూడా అవకాశాలు లభించడం కష్టమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి విశ్లేషకుల నుంచి.