Home సినిమా ఆ సినిమాలో నటించడం పొరపాటైందన్న నయనతార!

ఆ సినిమాలో నటించడం పొరపాటైందన్న నయనతార!

SHARE

ఇప్పటికే హీరోయిన్ గా దాదాపు పదిహేను సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది నయనతార. ఈ పదిహేనేళ్లలో ఆమె చాలా కాలంగా టాప్ హీరోయిన్ గా రాణిస్తూ ఉంది. తమిళంతో మొదలుకుని..తెలుగు, ఇతర దక్షిణాది భాషల్లో కూడా నయనతార టాప్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తోంది. అందులోనూ ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నయనతార నటిస్తూ ఉంది.

ఇలా తనకంటూ ప్రత్యేకతను కలిగిన ఈ హీరోయిన్ మరి కొంత కాలం కూడా టాప్ హీరోయిన్ గా రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో తన కెరీర్ ఇన్నేళ్ల గమనం గురించి నయనతార స్పందించింది. ఇన్నేళ్ల తన కెరీర్ లో ఒకే ఒక సినిమా విషయంలో ఆమె పొరపాటు చేసిందట. ఈ విషయాన్ని తనే చెప్పింది.

తను ఆ ఒక్క సినిమాలో నటించకపోయి ఉంటే బావుండేదని నయనతార అంటోంది. అలా నయనతారకు నచ్చని ఆమె నటించిన సినిమా ఏదంటే..’గజిని’. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో నయనతార ఒక పాత్రను చేసింది. అయితే ఆ సినిమాలు అసలు హీరోయిన్ అసిన్.

‘గజిని’ సినిమా అంటే అసిన్ గుర్తుకు వస్తోంది. ఆ సినిమాను హిందీలో రీమేక్ చేసినప్పుడు కూడా ఆ హీరోయిన్ పాత్ర నయనతారకే లభించింది. అంతలా ఆ సినిమాపై ముద్రను వేసింది నయనతార.

ఆ సినిమా రూపకర్తలు కథను వివరించే సమయంలో తనకు చెప్పింది వేరు, తెరకెక్కించింది వేరు.. అని.. వారి మాటలను నమ్మి తను ఆ సినిమాలో నటించడం పొరపాటు అయ్యిందని నయనతార అంటోంది!