Home సినిమా మహర్షి.. బయటపడిపోయినట్టేనా?

మహర్షి.. బయటపడిపోయినట్టేనా?

SHARE

మిక్స్డ్ రివ్యూలను పొందింది మహర్షి సినిమా. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా సూపరో సూపర్ అన్న వాళ్లు లేరు. అయితే ఫర్వాలేదన్న వాళ్లు మాత్రం చాలా మంది ఉన్నారు. ప్రత్యేకించి మహేశ్ ఫ్యాన్స్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశారు కూడా. రివ్యూలు, రేటింగ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకు యావరేజ్ మార్కులు పడ్డాయి.

మామూలుగా అయితే ఈ మాత్రం చాలు. అయితే ఇది భారీ బడ్జెట్ సినిమా కావడంతో… యావరేజ్ రేటింగ్స్, మిక్డ్స్ టాక్ తో మంచి వసూళ్లను సంపాదించుకుంటుందా.. అనేది సందేహంగానే కనిపిస్తూ ఉంది. ఇలాంటి క్రమంలో ‘మహర్షి’ వసూళ్ల విషయానికి వస్తే పాజిటివ్ ఫీలింగ్ కలుగుతూ ఉంది. ఈ సినిమా మంచి స్థాయిలో వసూళ్లను రాబట్టుకుంటోందని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఈ మేరకు పలువురు ట్రేడ్ ఎనలిస్టులు ట్వీట్స్ చేశారు.

నైజాంలో ఈ సినిమా మంచి వసూళ్లను సంపాదించిందని, మూడో రోజు ముగిసే సరికే పదమూడు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రీమియర్ షో వసూళ్లకు తోడు తొలి రోజు వసూళ్లతోనే మిలియన్ మార్కును రీచ్ అయినట్టుగా తెలుస్తోంది.

ఇలా మహేశ్ బాబు తాజా సినిమా వసూళ్ల విషయంలో మంచి స్థాయి నంబర్లే వినిపిస్తూ ఉన్నాయి. ఫర్వాలేదనిపించుకుంటున్న టాక్ కు తోడు.. వేసవి సెలవులు కావడంతో ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో బయటపడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.