Home రాజకీయాలు రవి ప్రకాష్ కు అవమానం.. బాధితుల సంబరాలు!

రవి ప్రకాష్ కు అవమానం.. బాధితుల సంబరాలు!

SHARE

మంచి కన్నా చెడుగానే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది టీవీ నైన్. ఒకవైపు మెరుగైన సమాజం కోసం అంటూ.. ట్యాగ్ లైన్ పెట్టుకుని.. అదే సమాజం చేత ఎన్నో ఛీత్కారాలు పొందింది టీవీ నైన్. కేవలం ప్రచార యావ ఉన్న వాళ్లకు తప్ప మరెవరికీ ఆ చానల్ మీద అభిమానాలు ఏమీ ఉండవు. ఏ ఉద్దేశంతో దాంట్లో వార్తలు ప్రసారం చేస్తారో ఎవరికీ తెలియదు.

కేవలం వివాదం రేపడం, ఆల్రెడీ రేగిన వివాదాల నుంచి చలి కాచుకోవడం టీవీ నైన్ తీరుగా సాగింది. ఇలాంటి క్రమంలో టీవీ నైన్ రవి ప్రకాష్ బాధితులు అనేక మంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. రవి ప్రకాష్ ను కొన్నేళ్ల కిందట ఒక వ్యక్తి చెప్పుతో కొట్టాడు అంటే అతడి ఇమేజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

తనను చెప్పుతో కొట్టిన వ్యక్తి చేత కాళ్లు పట్టించుకున్నాడు రవి ప్రకాష్. అంతిమంగా అదీ అతడు సాధించింది. ఇక టీవీ నైన్ నుంచి అతడు నిష్క్రమించిన వైనం అత్యంత అవమానకరంగా ఉంది.

రవి ప్రకాష్ పై పలు కేసులు నమోదు అయ్యాయి. అతడు ఒక ఫోర్ ట్వంటీ అని కేసు నమోదు అయ్యింది. అతడు ఫోర్జరీ కేసులు ఇరుక్కొన్నాడు. అతడు టీవీ నైన్ నిధులను తన సొంత మీడియా నెలకొల్పుకోవడానికి మళ్లించినట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. కేసులు కూడా నమోదయ్యాయి.

ఎన్ని నీతులు చెప్పాడో..అంత అవినీతి ఆరోపణలతో రవి ప్రకాష్ టీవీ నైన్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇలాంటి నేపథ్యంలో రవి ప్రకాష్ బాధితులు, అతడి చేత ఇబ్బంది పడ్డ వారు సంబరాలు చేసుకున్నంత ఆనందంగా కనిపిస్తూ ఉన్నారు. అనేక మంది అసహ్యించుకుంటున్న జర్నలిస్టుగా రవి ప్రకాష్ ప్రస్థానం టీవీ నైన్ లో ముగుస్తోంది.