Home రాజకీయాలు చంద్రబాబు ప్రయోగించిన తుప్పు పట్టిన మిసైల్ రవి ప్రకాష్!

చంద్రబాబు ప్రయోగించిన తుప్పు పట్టిన మిసైల్ రవి ప్రకాష్!

SHARE

‘తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రయోగించిన తుప్పు పట్టిన మిసైల్ రవి ప్రకాష్..’ అంటూ ధ్వజమెత్తారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఫోర్జరీ కేసులో పరారీలో ఉన్న రవి ప్రకాష్ పై విజయసాయి రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. రవి ప్రకాష్ పై విజయసాయి రెడ్డి ధ్వజమెత్తిన తీరు ఇలా ఉంది…

”మెరుగైన సమాజాన్ని అడ్డుకున్న ద్రోహి రవిప్రకాష్‌ బండారం ఎట్టకేలకు బయట పడింది. ఈయన బాధితులు ఒక్కొక్కరు ఇప్పుడు బయటకొస్తున్నారు. ‘కమ్మ’ని నీతులకు కాలం చెల్లింది. చంద్రబాబు ప్రయోగించిన తుప్పు పట్టిన మిస్సైళ్లలో రవిప్రకాష్‌ ఒకడు.

ఎర్ర చందనం స్మగ్లర్ల నుంచి తన మనుషుల ద్వారా నెలనెలా మామూళ్లు తీసుకున్న ఆరోపణలపై కూడా రవి ప్రకాష్‌పై దర్యాప్తు జరగాలి. ఆ చనువుతోనే స్మగ్లర్లు టివీ9 మీడియా స్కిక్కర్లు వేసిన వాహనాల్లో ఎర్రచందనం తరలించారు. లక్షల కోట్ల ఎర్ర చందనం తరలి పోవడంలో మీడియా ప్రముఖుడి పాత్ర కూడ ఉండటం దారుణం.

‘మెరుగైన సమాజం కోసం’ పరివర్తన తీసుకుచ్చే ప్రవక్తలాగా చెలరేగిన రవి ప్రకాష్‌ చేయని దుర్మార్గాలు లేవు. మతాలను కించపర్చడం, కార్పోరేట్ల విబేధాల నుంచి భార్య భర్తల గొడవల వరకు టివీ స్ర్కీన్ పైకి ఎక్కించి సమాజాన్ని భ్రష్టు పట్టించాడు. కులం లేదంటూనే గజ్జిని వ్యాప్తి చేశాడు.

పరారీలో ఉన్న రవిప్రకాశ్ తనతో పాటు కొన్ని ఫైళ్లు, హార్డ్ డిస్కులు, ల్యాప్ టాప్ తీసుకెళ్లినట్టు సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. మెరుగైన సమాజం కోసం ‘చెమటలు’ కక్కిన రవిప్రకాశ్ తక్షణం పోలీసులకు లొంగి పోయి సహకరించారలని పౌర సమాజం కోరుతోంది

శ్రీని రాజు సంస్థలో పనిచేస్తూ ఆయన తోడల్లుడు సత్యం రామలింగరాజును బ్లాక్ మెయిల్ చేసిన ఘనుడు రవిప్రకాశ్. బెయిల్ రావడానికి ముందు చికిత్స కోసం నిమ్స్ లో చేరాడు. ఆ సమయంలో ఆయన సెల్ ఫోన్లో మాట్లాడుతుండగా స్పై క్యామ్ తో రికార్డు చేయించి కోట్లు వసూలు చేశాడని చెబ్తారు.”