Home సినిమా మిక్డ్స్ టాక్.. మిలియన్ డాలర్ల మార్కును రీచ్ అయిన ‘మహర్షి’

మిక్డ్స్ టాక్.. మిలియన్ డాలర్ల మార్కును రీచ్ అయిన ‘మహర్షి’

SHARE

ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమాకు మిక్డ్స్ టాక్ వస్తోంది. చాలా మంది ఈ సినిమాను ప్రశంసిస్తూ ఉన్నారు. మరి కొందరు మహర్షి యావరేజ్ అని అంటూ ఉన్నారు. స్థూలంగా ఇలా మిశ్రమమైన రివ్యూలను పొందుతూ ఉంది ఈ సినిమా. యావరేజ్ రేటింగులను పొందుతూ ఉంది.

ఈ సినిమా ఒక ఒడిదుడుకుల ప్రయాణం అంటూ రివ్యూయర్లు వ్యాఖ్యానిస్తూ ఉండటం విశేషం. కొన్ని పాత సినిమాలను గుర్తు చేసేలా ఉండటం, లెంగ్తీగా ఉండటం ఈ సినిమాకు మైనస్ పాయింట్లు అని అంటున్నారు. అలాగని మరీ బోర్ కొట్టించదని, కానీ థియేటర్లలో సీట్లకు కట్టిపడేసేలా కూడా ఈ సినిమా లేదని వారు పేర్కొన్నారు.

ఇలా పాజిటివ్, నెగిటివ్ టాక్ మిక్స్ అయిన ప్రచారాన్ని పొందుతూ ఉంది మహర్షి. అయితే తొలి రోజు వసూళ్ల విషయంలో మాత్రం ఈ సినిమాకు తిరుగులేదని స్పష్టం అవుతోంది.

ఈ సినిమా యూఎస్ ప్రీమియర్ షోస్ తోనే హాఫ్ మిలియన్ మార్కు వసూళ్లను అందుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక తొలి రోజు వసూళ్లతో ఈ సినిమా మిలియన్ మార్కును రీచ్ కావడం ఏమాత్రం కష్టం కాదక్కడ. ఇక దేశీయంగా కూడా ఈ సినిమాకు తొలి రోజున భారీ వసూళ్లే దక్కాయి.

అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ మార్కెట్లో భారీ వ్యాపారాన్నే చేసింది. భారీ బడ్జెట్ సైతం ఈ సినిమా కోసం పెట్టారు. ఇలాంటి నేపథ్యంలో యావరేజ్ టాక్ తో ఈ సినిమా ఎంత మేరకు డిస్ట్రిబ్యూటర్ల పెట్టుబడులను వెనక్కు రాబడుతుందో!