Home రాజకీయాలు చంద్రబాబువి కేవలం ప్రగల్బాలు మాత్రమే!

చంద్రబాబువి కేవలం ప్రగల్బాలు మాత్రమే!

SHARE

కేబినెట్ భేటీ విషయంలో కొండత రాగం తీసిన చంద్రబాబు నాయుడు ఆఖరికి కామ్ అయిపోవాల్సి వస్తోంది. కేబినెట్ భేటీని సీఎం హోదాలో తను జరిపితీరడమే అంటూ చంద్రబాబు నాయుడు ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ భేటీకి ఏర్పాట్లు చేయాలంటూ చంద్రబాబు నాయుడు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యానికి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ‘కేబినెట్ భేటీకి అధికారులు ఎలా రారో చూస్తానంటూ..’ అంటూ చంద్రబాబు నాయుడు హూంకరించారు కూడా!

కట్ చేస్తే చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా పదో తేదీన కేబినెట్ భేటీ జరగడం లేదు. ఈ మేరకు కేబినెట్ భేటీ రద్దు అయ్యింది. అయితే చంద్రబాబు నాయుడు అనుకూల మీడియానేమో పదో తేదీన కేబినెట్ భేటీ జరగడం లేదని… నాలుగు రోజుల పాటు వాయిదా పడిందని.. పద్నాలుగో తేదీన బాబుకేబినెట్ తో సమావేశం కాబోతున్నారని వాదిస్తోంది.

అయితే ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే మాత్రం అది కూడా జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఎన్నికల నియామవళి ప్రకారం..కోడ్ అమల్లో ఉండగా కేబినెట్ భేటీకి అవకాశమే ఉండదు. మరీ ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితులు వస్తే తప్ప కేబినెట్ సమావేశం జరగదు. ఫలితంగా ఏపీలో కేబినెట్ భేటీ జరిగే అవకాశాలు కనిపించడం లేదు.

ఈ మేరకు ఇప్పటికే స్పష్టత వచ్చింది. కేబినెట్ భేటీలో ఏయే అంశాలను చర్చించాలని అనుకుంటున్నారో చెప్పాలంటూ సీఎస్ కోరారు. ఆ అంశాలేవో పేర్కొంటే వాటిని ఎన్నికల కమిషన్ కు పంపించి..వాటిపై అక్కడ నుంచి అనుమతి తీసుకుని..కేబినెట్ భేటీని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే అత్యవసరమైన అంశాలు ఏవీ లేకపోతే..ఏపీ కేబినెట్ భేటీకి ఎన్నికల సంఘం అనుమతిని ఇచ్చే అవకాశం కనపడం లేదు. ఏతా వాతా.. చంద్రబాబు నాయుడు కేబినెట్ భేటీ విషయంలో చేసిన వ్యాఖ్యలు కేవలం ప్రగల్బాలు మాత్రమే అని తేలిపోతోందని పరిశీలకులు అంటున్నారు.