Home రాజకీయాలు కేసీఆర్, జగన్ ల మీద కన్నేసిన కాంగ్రెస్!

కేసీఆర్, జగన్ ల మీద కన్నేసిన కాంగ్రెస్!

SHARE

కేంద్రంలో ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్రయత్నంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా ఉంది. నిన్నటి వరకూ తమకు ఆ పార్టీలు శత్రవులు అని ప్రకటించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ పార్టీలనే ప్రాధేయ పడటానికి రెడీ అవుతోంది

ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్ టార్గెట్ గా చేసుకుంది. ఏపీ కాంగ్రెస్ నేతలు ఆ విషయంలో స్పందిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కూటమికే మద్దతు పలకాలని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి లెటర్ రాశారు!

అలా కేసీఆర్ మద్దతును పొందే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అయితే కేసీఆర్ మాత్రం వీరి లేఖలను పట్టించుకోవడం లేదు.ఆయన ఫెడరల్ ఫ్రంట్ అంటూతిరుగుతూ ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ టార్గెట్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఉన్నారని స్పష్టం అవుతోంది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉందట కాంగ్రెస్ అధిష్టానం.

అందుకే తమ పార్టీ నేతల చేత వ్యూహాత్మకంగా మాట్లాడిస్తూ ఉన్నట్టుంది ఆ పార్టీ. ‘కేసీఆర్, జగన్ లు యూపీఏలోకే రావొచ్చు..’ అంటూ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఇలా వారి మీద కాంగ్రెస్ వాళ్లు వల వేస్తున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎన్నికల ఫలితాల తర్వాత అసలు రాజకీయం ఎలా ఉంటుందో!