Home రాజకీయాలు కేసీఆర్ గేమ్ మళ్లీ మొదలైంది.. ఏం జరగనుంది?

కేసీఆర్ గేమ్ మళ్లీ మొదలైంది.. ఏం జరగనుంది?

SHARE

తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ తన గేమ్ ను మళ్లీ మొదలుపెట్టారు. కొన్ని నెలల కిందటే కేసీఆర్ ఈ ఆటను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు కేసీఆర్ ప్లాన్స్ వర్కవుట్ కాలేదు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ వివిధ రాష్ట్రాలు తిరిగారు. కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్, యూపీ రాష్ట్రాలకు కేసీఆర్ వెళ్లొచ్చారు.

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ల ప్రత్యామ్నాయ కూటమిని అధికారంలోకి తేవడమే లక్ష్యమంటూ కేసీఆర్ అప్పుడు ప్రకటించారు. అందుకోసం ఆయా పార్టీల అధినేతలతో సమావేశం అయినట్టుగా కేసీఆర్ ప్రకటించారు. అయితే అప్పుడు కేసీఆర్ ప్రయత్నాలు అంత ఫలప్రదం కాలేదు.

కర్ణాటకకు వెళ్లి జేడీఎస్ నేతలను కలిశారు కేసీఆర్. అప్పుడేమో వారు తల ఊపారు.. కానీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసి జేడీఎస్ కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలా తమ రాజకీయం తమకుముఖ్యమంత్రి జేడీఎస్ వాళ్లు స్పష్టత ఇచ్చారు.

ఇక తమిళనాడులోనూ అదే కథ. అప్పుడు కేసీఆర్ కు సాదర స్వాగతం పలికిన స్టాలిన్ ఆ తర్వాత కూడా కాంగ్రెస్ తోనే సఖ్యతగా ఉన్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా పెద్దగా స్పందించలేదు.

అలా అప్పుడు కేసీఆర్ చేసిన పర్యటనలు పెద్దగా ఉపయోగం లేకుండానే ముగిశాయి. అయితే ఇప్పుడు కేసీఆర్ మళ్లీ మొదలుపెట్టారు. వివిధ రాష్ట్రాలకు తిరుగుతూ వివిధ పార్టీల నేతలను కలిసి ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను మళ్లీ మొదలుపెట్టారు. మరి ఈ సారి కేసీఆర్ ప్రయత్నాలు ఎంత వరకూ విజయ వంతం అవుతాయో.. కేంద్రంలో ఈయన చక్రం ఏ మేరకు తిరిగే అవకావాలున్నాయో!