Home ప్రత్యేకం విజయంపై వైఎస్ జగన్ లో ధీమాకు మరో నిదర్శనమిది!

విజయంపై వైఎస్ జగన్ లో ధీమాకు మరో నిదర్శనమిది!

SHARE

ఇప్పటికే పోలింగ్ పూర్తి అయిన ఏపీ ఎన్నికల ప్రక్రియ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం మీదే చాలా మంది అంచనాలతో ఉన్నారు. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే నెగ్గుతుందనే అభిప్రాయాలే ఎక్కువగా వ్యక్తం అవుతూ ఉన్నాయి. ప్రీ పోల్ సర్వేలు, పోస్ట్ ఎనాలిసిస్ లు అదే మాటే చెబుతూ ఉన్నాయి.

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా విజయం విషయంలో అదే ధీమాతో ఉన్నారు. తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని వారు అంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంలో పోలింగ్ పూర్తి అయినప్పుడే తన అంచనాలను స్పష్టం చేశారు. తమ పార్టీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధిస్తుందని జగన్ ధీమాగా చెప్పారు.

ఆ తర్వాత జగన్ చాలా కామ్ ఉంటూ వస్తున్నారు. పదే పదే ఎన్నికల ప్రక్రియ గురించి జగన్ మాట్లాడలేదు. ఈ విషయంలో జగన్ నిండుకుండలా వ్యవహరిస్తూ ఉన్నారు. పదే పదే తమదే విజయం అని అనడం కానీ, సమీక్షలు అంటూ పార్టీ నేతలను పిలిపించుకుని ఊదరగొట్టడం కానీ జగన్ చేయలేదు.

కామ్ గా తన పనేదో తను చేసుకొంటూ వెళ్తూ ఉన్నారు. వారం రోజుల పాటు జగన్ విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత కూడా జగన్ సమయాన్ని సరదాగా గడుపుతూ ఉన్నారు. అందులో భాగంగా తాజాగా జగన్ మోహన్ రెడ్డి సినిమా థియేటర్లో దర్శనమివ్వడం ఆసక్తిదాయకంగా మారింది.

హైదరాబాద్ లో మహేశ్ బాబు మల్టీప్లెక్స్ లో జగన్ మోహన్ రెడ్డి అవేంజర్స్ –ది ఎండ్ గేమ్ సినిమా చూడటం ఆసక్తిదాయకంగా మారింది. కుటుంబంతో కలిసి జగన్ సినిమాకు వెళ్లారని తెలుస్తోంది. జగన్ కోసం మొత్తం ఇక స్క్రీన్ లోని సీట్లన్నీ బుక్ చేశారని సమాచారం.

సినిమా మీద జగన్ ఆసక్తి సంగతలా ఉంటే.. జగన్ సరదాగా ఉన్నారని, విజయం మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే ఎవరైనా అలా గడపగలరని.. జగన్ తీరును చూస్తుంటే విజయం మీద ఆయన ఎంత ధీమాతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.