Home సినిమా రానాకు సాయి పల్లవి ఝలక్.. ఆ సినిమాకు గుడ్ బై?

రానాకు సాయి పల్లవి ఝలక్.. ఆ సినిమాకు గుడ్ బై?

SHARE

ఇప్పటికే తన వ్యక్తిగత మైన తీరుతో సాయి పల్లవి తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంది. ఆమెకు పొగరని, తల బిరుసు అని కొన్ని ప్రచారాలు ఉన్నాయి. కొంతమంది హీరోలే సాయి పల్లవి విషయంలో అలాంటి ప్రచారాలు చేశారు. అయితే మరి కొందరు ఆ ప్రచారాలు తప్పు అని వ్యాఖ్యానించారు. సాయి పల్లవి మంచి కో వర్కర్ అని వారు ప్రశంసించారు.

వ్యక్తిగతంగా టాలెంటెడ్ అయిన సాయి పల్లవి అలాంటి కామెంట్లతో పని లేకుండా కెరీర్ ను కొనసాగిస్తూ ఉంది. ఆమె టాలెంట్ కు తగినట్టుగా అవకాశాలు వస్తున్నాయి. అలాంటి సినిమాలు హిట్ అవుతుండటంతో ఆమె కెరీర్ బ్రహ్మాండంగా సాగుతూ ఉంది.

ఇలా దూసుకుపోయే హీరోయిన్ల విషయంలో సహజంగానే అలాంటి ప్రచారాలు కూడా సాగుతూ ఉంటాయి. ఆ సంగతలా ఉంటే.. సాయి పల్లవి తాజాగా దగ్గుబాటి రానా హీరోగా నటిస్తున్న ఒక సినిమా నుంచి తప్పుకోవడానికి రెడీ అయినట్టుగా సమాచారం. ఆ సినిమా పేరు ‘విరాటపర్వం’.

ఆ సినిమాలో నటించడానికి సాయి పల్లవి ముందుగా సైన్ చేసిందట. అయితే ఆ సినిమాను అనుకున్న సమయానికి పట్టాలెక్కించలేకపోయారు దాని రూపకర్తలు. రెగ్యులర్ షూటింగ్ సరిగా సాగడం లేదని తెలుస్తోంది. ఆ సినిమా కోసం సాయి పల్లవి కేటాయించిన డేట్స్ కూడా ఇప్పటికే అయిపోయాయట. ఆ సినిమా కోసమని తను కేటాయించిన డేట్స్ లో షూటింగ్ చేయకపోవడంతో ఆమె ఖాళీగా ఉండాల్సి వస్తోందట. ఇలా ఆమె కెరీర్ కు ఆ సినిమా ఇబ్బందికరంగా మారుతోందని సమాచారం.

తదుపరి సినిమాల విషయంలో ఒప్పందాలు చేసుకోవడం లో సాయి పల్లవికి రానా సినిమా అడ్డంకిగా మారుతోందట. అందుకే ఆమె ఆ సినిమా నుంచి తప్పుకోనున్నారని, ఆ ప్రాజెక్టు నుంచి బయటకు రావడానికి రెడీ అవుతున్నారని సమాచారం!