Home ప్రత్యేకం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయం..సీట్ల లెక్కలివే!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయం..సీట్ల లెక్కలివే!

SHARE

సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ (సీపీఎస్)కు సంబంధించిన ఒక అధ్యయనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాట్సాప్ వేదికగా అది బాగా షేర్ అవుతూ ఉంది. ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసిన నేఫథ్యంలో ఎగ్జిట్ పోల్ తరహా అధ్యయనం అది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో ప్రభంజనం లాంటి విజయం సాధించడం ఖాయమనే అంచనాలను వ్యక్తం చేస్తూ ఉంది ఆ అధ్యయనం.

సీపీఎస్ కు సంబంధించి ఎన్నికల ముందు కూడా ఒక సర్వే వైరల్ గా నిలిచింది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఎన్నికల ముందు అధ్యయనంలో కూడా సీపీఎస్ పేర్కొంది. ఇక పోలింగ్ పూర్తి అయిన నేపథ్యంలో కూడా సీపీఎస్ నుంచి అదే తరహా అభిప్రాయం వినిపిస్తూ ఉంది.

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి అయిన పోలింగ్ ను బట్టి ఆ విషయాన్ని చెప్పవచ్చునని సీపీఎస్ పేర్కొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నూటా ఇరవై నాలుగు వరకూ ఎమ్మెల్యే సీట్లు దక్కే అవకాశం ఉందని సీపీఎస్ అంచనా వేసింది. తెలుగుదేశం పార్టీ నలభై సీట్లతో సర్దు కోవాల్సి ఉంటుందని.. జనసేన రూపంలో ఇతరులు రెండు సీట్ల వరకూ నెగ్గే అవకాశం ఉందని ఆ సంస్థ పేర్కొంది. తొమ్మిది సీట్లలో పోటాపోటీ పరిస్థితి ఉంటుందని వివరించింది.

ఏతావాతా అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఈ అధ్యయనం అంచనా వేస్తూ ఉంది. పోలింగ్ తర్వాత కూడా సీపీఎస్ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మే ఇరవై మూడున ఈ విజయం పై అధికారిక ప్రకటన రానుంది.