Home సినిమా మహేశ్ చేయాల్సిన సినిమా నాని చేస్తున్నాడా!

మహేశ్ చేయాల్సిన సినిమా నాని చేస్తున్నాడా!

SHARE

విక్రమ్ కే కుమార్.. తనకంటూ ప్రత్యేకతను కలిగిన దర్శకుడు. వరసగా వివిధ వైవిధ్య భరితమైన సినిమాలను రూపొందించిన దర్శకుడు. ప్రత్యేకించి ఇష్క్, మనం, ట్వంటీ ఫోర్.. ఇలా హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నాడు. ఒకటేమో లవ్ స్టోరీ, మరోటి ఫిక్షనల్ స్టోరీ, మూడోది సైఫై.. ఇలాంటి విభిన్న జోనర్లలో సినిమాలను తెరకెక్కించి వాటిని సూపర్ హిట్స్ గా మలుచుకుని, తనకంటూ ప్రత్యేక అభిమానగణాన్ని సంపాదించుకున్నాడు విక్రమ్ కుమార్.

అలా వరస విజయాలు నమోదు చేసినప్పుడు విక్రమ్ కుమార్ తో సినిమాలు చేయడానికి హీరోలంతా పోటీ పడ్డారు. ప్రత్యేకించి తెలుగు హీరోలు కూడా ఆ విషయంలో ఉత్సాహం చూపించారు. అయితే ఒకే ఒక్క సినిమా సరిగా ఆడకపోవడం విక్రమ్ కుమార్ కెరీర్ ను కాస్త ఇబ్బందుల్లోకి నెట్టింది.

అఖిల్ తో విక్రమం రూపొందించిన సినిమా సరిగా ఆడకపోవడంతో.. ఈ దర్శకుడి సినిమాలు డిలే అవుతున్నాయి. ఇతడిని పెద్ద హీరోలు పక్కన పెట్టిన దాఖలాలు కనిపిస్తున్నాయి. మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటి హీరోలు విక్రమ్ కుమార్ తో ఇంతకు ముందు సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపించారు. అయితే ఇప్పుడు వారితో సినిమాలు పట్టాలెక్కడం లేదు. అయితే నాని హీరోగా విక్రమ్ కుమార్ సినిమా స్టార్ట్ కాబోతోంది. దీనికి ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమా టైటిల్ ను ఇలా నాని సినిమా కోసం వాడుతూ ఉన్నారు. వాస్తవానికి ఈ కాన్సెప్ట్ ను మహేశ్ బాబు కోసం అనుకున్నాడట విక్రమ్ కుమార్. ఆ హీరోతోనే పట్టాలెక్కాల్సిన సినిమా అట ఇది. అయితే మహేశ్ తో కుదరకపోవడంతో నానితో ఆ కాన్సెప్ట్ ను తెరకెక్కిస్తున్నాడట ఈ దర్శకుడు!