Home సినిమా మహేశ్ బాబు తదుపరి సినిమా టైటిల్ అదే!

మహేశ్ బాబు తదుపరి సినిమా టైటిల్ అదే!

SHARE

ఒకవైపు ‘మహర్షి’ సినిమా విడుదలకు సమాయత్తం అవుతూ ఉండగా.. ప్రిన్స్ మహేశ్ బాబు తన తదుపరి సినిమాల విషయంలో కూడా బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అయిన నేపథ్యంలో మహేశ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాను ఓకే చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఎఫ్ 2 సినిమాతో అనిల్ రావిపూడి సూపర్ హిట్ ను అందుకున్నాడు.

సరదా కాన్సెప్ట్ తో రూపొందిన ఆ సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది. ఈ క్రమంలో అనిల్ రావిపూడికి మహేశ్ బాబుతో సినిమా చేసే అవకాశం దక్కింది. ఇక మహేశ్ తో సినిమాకు టైటిల్ ను కూడా ఫిక్స్ చేసుకున్నాడట అనిల్ రావిపూడి.

ఆ సినిమాకు ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్ అనుకుంటున్నాడట ఆ దర్శక, రచయిత. ఎఫ్ టు అంటూ ఇంగ్లిష్ టైటిల్ తో హిట్ కొట్టిన ఈ దర్శకుడు ఈ సారి మాత్రం అచ్చ తెలుగు టైటిల్ తో వస్తున్నాడు.
సరి లేరు నీకెవ్వరూ.. అనేది ఒక సూపర్ హిట్ పాట కూడా. మరోవైపు సరదాగా హీరోయిజాన్ని ఎలివేట్ చేసే టైటిల్ కూడా అది. ఈ టైటిల్ వింటుంటే.. మహేశ్ తో కూడా అనిల్ రావిపూడి సరదా సినిమానే చేయబోతున్నాడనే అభిప్రాయాలు కలుగుతూ ఉన్నాయి.

మహేశ్ హీరోగా ఇది వరకూ వచ్చిన ‘ఆగడు’ సినిమాకు రచయితగా పని చేశాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు దర్శకుడి మహేశ్ తో సినిమాను రూపొందిస్తున్నాడు.