Home రాజకీయాలు నరసరావుపేట: గెలుపు దిశగా లావు శ్రీకృష్ణదేవరాయలు

నరసరావుపేట: గెలుపు దిశగా లావు శ్రీకృష్ణదేవరాయలు

SHARE

ఆరంభం నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఈసారి వైఎస్సార్‌సీపీ పాగా వేయనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ కంచుకోట బద్దలు కానుందని స్థానికులు చెబుతున్నారు. ఏడు స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచే పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కూడా రాష్ట్రమంతా కాంగ్రెస్‌ గాలి వీచినా.. నరసరావుపేట పార్లమెంటులో మాత్రం టీడీపీ హవా సాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా 2009లో ఎన్నికల్లో టీడీపీ ఆరు ఎంపీ స్థానాలు గెలిస్తే అందులో నరసరావుపేట ఒకటి కావడం విశేషం. 2008లో నియోజకరవ్గాల పునర్‌ విభజన తర్వాత జరిగిన 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. గతంలో నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఉన్న కొన్ని అసెంబ్లీ స్థానాలు పునర్విభజన తర్వాత లేకపోవడం.

ప్రకాశం జిల్లాలో రెడ్డి సామాజిక వర్గంతో పాటు కాంగ్రెస్‌ పార్టీకి సంప్రదాయ ఓటర్లు అధికంగా ఉన్న దర్శి, యర్రగొండపాలెం, మార్కాపురం లాంటి నియోజకవర్గాలు 2009 ఎన్నికల నాటికి నరసరావుపేట నుంచి విడిపోయి ఒంగోలు పార్లమెంటులో కలిశాయి. అప్పటి వరకు గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్న చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు స్థానాలు నరసరావుపేట పార్లమెంటులో కలిశాయి. ఈ దెబ్బకు నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఒక్క సారిగా కమ్మ ఓటర్లు పెరిగిపోయారు. ఏకంగా 2.5లక్షల మంది కమ్మ ఓటర్లు నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం సహజంగానే టీడీపీ వైపు ఉంటారనే విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

ఫలితంగా టీడీపీ అభ్యర్థి ఈ పార్లమెంటులో గెలుపు బావుటా ఎగురవేయడం పరిపాటిగా మారింది. 2009లో టీడీపీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మోదుగులకు టికెట్టు ఇవ్వడం వల్ల పూర్తిగా లబ్ధి పొందింది. 2014లో పవన్‌కల్యాణ్‌ మద్దతు ఉండటంతో కమ్మ, కాపు ఏకమై పార్లమెంటు అభ్యర్థి గెలుపునకు బాటలు వేసుకున్నారు. ఇలాంటి నరసరావుపేట నియోజవర్గంలో ఈ సారి ఎన్నికల్లో టీడీపీ ఓటమి చవిచూడబోతోందని అంచనా వేస్తున్నారు. టీడీపీ తరఫున సిట్టింగ్‌ ఎంపీ రాయపాటి సాంబశివరావు, వైఎస్సార్‌సీపీ నుంచి లావు కృష్ణదేవరాయలు పోటీలో ఉన్నారు. అయితే ప్రస్తుతం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హవా ముందు సైకిల్‌ పంక్చర్‌ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

శ్రీకృష్ణదేవరాయలు – సరికొత్త చరిత్ర
నరసరావుపేట పార్లమెంటు నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున లావు శ్రీకష్ణదేవరాయలు పోటీ చేస్తున్నారు. ఫలితంగా ఈసారి గెలుపు ఈజీ అవుతోందని తెలుస్తోంది. నరసరావుపేట పార్లమెంటు పునర్విభజన తర్వాత టీడీపీయేతర పార్టీ ్టతొలిసారిగా గెలిచే అవకాశం ఉంది. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థితో పోల్చుకుంటే ఒక్క రాజకీయ అనుభవం మినహా మిగిలిన అన్ని విషయాల్లోనూ ఆయనే ముందంజలో ఉండటం వైఎస్సార్‌సీపీ విజయానికి కలిసొచ్చే అంశం.

విజయావకాశాలు
– గత ఎన్నికల్లో టీడీపీకి పవన్‌ కల్యాణ్, బీజేపీ మద్దతు ఉండేది. ప్రస్తుతం మైనస్‌ కానుంది. ఫలితంగా వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు.
– 2014లో రైతుల రుణమాఫీ చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఫలితంగా గెలిచిందని చెప్పవచ్చు.
– ఐదేళ్లు గడిచినా రుణమాఫీ చేయలేదు. ఫలితంగా రైతుల నుంచి పూర్తి వ్యతిరేకత ఉంది.
– అదేవిధంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడం కూడా టీడీపీకి మైనస్‌ కానుంది.
– పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ ఐదు స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించే అవకాశం ఉంది. మరో రెండు స్థానాల్లో భారీ పోటీ నెలకొంది.