Home సినిమా చాన్నాళ్ల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ కు కళ!

చాన్నాళ్ల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ కు కళ!

SHARE

ఈ ఏడాదిలో తెలుగు సినిమాల విజయాల శాతం గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ సారి మెజారిటీ సినిమాలు ఫెయిల్యూర్ గానే నిలిచాయి. ఏప్రిల్ నెల మూడో వారానికి కూడా ఈ సారి విజయవంతమైన సినిమాల జాబితా వేళ్ల మీద లెక్క పెట్టుకోదగిన స్థాయిలోనే ఉంది.

ఎఫ్ టూ, యాత్ర, మజిలీ వంటి సినిమాలను మినహాయిస్తే విజయాలను అందుకున్న సినిమాలు చాలా తక్కువ. అందుకు ప్రతిగా చాలా సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన వివిధ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చాయి ఆ సినిమాలు.

దీంతో బాక్సాఫీస్ కు కళ తప్పింది. అయితే ఇటీవల ‘మజిలీ’ సినిమా రావడంతో ఆ పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తూ ఉంది. ఇక ఈ వారం ప్రధానంగా రెండు సినిమాలు విడుదల అయ్యాయి. రెండూ మంచి అంచనాల మధ్యన ప్రేక్షకులను ఆకర్షిస్తూ ఉన్నాయి.

వాటిల్లో ఒకటి ‘కాంచన 3’ కాగా మరోటి ‘జెర్సీ’. ఇప్పటి వరకూ కాంచన సీరిస్ లో రెండు సినిమాలు విజయవంతం కావడంతో ఆ సినిమాల రూపకర్త లారెన్స్ మూడో ఇన్ స్టాల్ మెంట్ తో వచ్చాడు.

ఇక రొటీన్ కథల్లో పడిపోయాడనుకున్న నాని ఇప్పుడు ‘జెర్సీ’తో వైవిధ్యతకు ప్రాధాన్యతను ఇస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాడు.

ఈ సినిమాల విడుదలతో బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇవి విజయవంతం అయితే టాలీవుడ్ మళ్లీ విజయాల బాట పట్టినట్టే అవుతుంది!