Home రాజకీయాలు చంద్రబాబు అధికార దాహం.. రాజ్యాంగాన్ని వెక్కిరిస్తున్నాడా?

చంద్రబాబు అధికార దాహం.. రాజ్యాంగాన్ని వెక్కిరిస్తున్నాడా?

SHARE

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ సమీక్షలు నిర్వహించడం విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విమర్శల పాలవుతూ ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. తనే ముఖ్యమంత్రిని అని చెప్పుకొంటూ చంద్రబాబు నాయుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది రాజ్యాంగబద్ధమైన విధానం కాదు.

రాజ్యాంగం ప్రకారం.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నవేళ అధికారంలో ఉన్న వాళ్లు కేవలం అపద్ధర్మంగా వ్యవహరించాల్సి ఉంది. ఏపీలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పోలింగ్ పూర్తి అయినా.. ఫలితాలు వచ్చే వరకూ కూడా కోడ్ అమల్లోనే ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ మొత్తం వ్యవస్థ ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఉంటుంది.

రాష్ట్రానికి ఎన్నికల కమిషనరే సుప్రిమో, కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం పాలన జరగాల్సి ఉంటుంది. ఇదేమీ కొత్తగా జరుగుతున్నది కాదు. మొదటి నుంచి అమల్లో ఉన్న నియమమే ఇది. దేశంలోని పాలకులు అంతా ఈసీని అలా గౌరవిస్తూ వచ్చారు.

అయితే చంద్రబాబు నాయుడు మాత్రం తన అధికార దాహంతో వ్యవహరిస్తూ ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ చంద్రబాబు నాయుడు తనకు తోచినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని వెక్కిరించేలా ఉంది చంద్రబాబు నాయుడి తీరు.

సీఎం హోదాలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు సమీక్షలు నిర్వహించకూడదని నియమాలు చెబుతున్నా, బాబు తనే ముఖ్యమంత్రిని అంటూ చెప్పుకుంటున్నారు. కోడ్ అమల్లో ఉన్న వేళ తను హోదాకు మాత్రమే సీఎం అనే విషయం చంద్రబాబుకు తెలియనిది కాదు.

అయితే చంద్రబాబు నాయుడు ఇప్పుడు తీవ్రమైన అసహనంతో ఉన్నారు. అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. అధికార దాహంతో వ్యవస్థను కూడా తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం అధినేత.