Home సినిమా తమన్నా చూపు ముద్దులు, డేటింగ్ మీద పడింది!

తమన్నా చూపు ముద్దులు, డేటింగ్ మీద పడింది!

SHARE

ఆ మధ్య హృతిక్ రోషన్ తో అయితే లిప్ లాక్ లకు సై అంటూ ప్రకటన చేసింది తమన్నా. మామూలుగా అయితే తను లిప్ లాక్ సన్నివేశాల్లో నటించేది ఉండదంటూ..ఒకవేళ ఆపోజిట్లో హృతిక్ రోషన్ ఉంటే అలాంటి సన్నివేశాల్లో నటించేందుకు సై అంటూ తమన్నా చెప్పుకొచ్చింది.

తను లిప్ లాక్ సీన్లకు ఇష్టపడేది ఉండదంటూనే.. హృతిక్ తో ముద్దులాటకు సై అంటూ బోల్డ్ గా చెప్పింది తమన్నా. ఇక ఇప్పుడు ఈమె డేటింగ్ విషయంలో స్పందించింది. ఒక ప్రముఖ నటుడి పేరు చెప్పి.. అతడితో డేటింగ్ కు తను సిద్ధంగా ఉన్నట్టుగా తమన్నా చెప్పుకొచ్చింది.

తమన్నా అలా పడిపోయింది మరెవరికో కాదు..విక్కీ కౌశల్ కు. ‘సంజూ’ ‘ఉడి’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న విక్కీకి పడిపోయిందట తమన్నా. అతడితో డేటింగ్ కు సై అంటూ ఈమె అతడిపై తనకున్న ఆసక్తిని చాటుకుంది.

మొత్తానికి మొన్నేమో లిప్ కిస్సుల విషయంలో, ఇప్పుడేమో డేటింగ్ విషయంలో తమన్నా స్పందించింది. ఇలా తన ఆసక్తి అటుగా ఉందనే విషయాన్ని చాటుతోంది.

ఇక తమన్నా ఒక అమెరికన్ డాక్టర్ తో ప్రేమాయణాన్ని నెరిపిస్తోందని.. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని ఆమె ధ్రువీకరించడం లేదు!