Home రాజకీయాలు కాంగ్రెస్ కూటమి.. బీజేపీ.. అక్కడ పట్టు ఎవరిది?

కాంగ్రెస్ కూటమి.. బీజేపీ.. అక్కడ పట్టు ఎవరిది?

SHARE

-లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ నేడు సాగుతూ ఉంది. ఈ దశలో దక్షిణాదిన ప్రధానంగా రెండు రాష్ట్రాల్లో పోలింగ్ సాగుతూ ఉంది. తమిళనాడులోని ముప్పై ఎనిమిది సీట్లకు, కర్ణాటకలోని పద్నాలుగు ఎంపీ సీట్లకు పోలింగ్ సాగుతూ ఉంది. పాండిచ్చేరిలోని ఒక సీటుకు కూడా పోలింగ్ సాగుతూ ఉంది.

-ప్రధానంగా దక్షిణాదిలో పోలింగ్ సాగుతున్న సీట్లను గమనిస్తే.. వాటిల్లో కాంగ్రెస్ కూటమికి- బీజేపీకి గట్టి పోటీ సాగుతోంది.

-తమిళనాడు మీద కాంగ్రెస్-డీఎంకేల కూటమి గట్టిగా ఆశలు పెట్టుకుంది. ఇక కర్ణాటక మీద బీజేపీ ఆశలు పెట్టుకుంది. అక్కడ కాంగ్రెస్- జేడీఎస్ లు కూటమిగా బరిలోకి దిగాయి.

-గత ఎన్నికల్లో తమిళనాట కాంగ్రెస్-డీఎంకేల కూటమి పూర్తిగా జీరోగా నిలిచింది. కనీసం ఒక్క ఎంపీ సీటు బలాన్ని కూడా తమిళనాడు సాధించలేకపోయింది.

-దీంతో ఈ సారి పరిస్థితి మారుతుందని ఆ కూటమి ఆశిస్తోంది. కాంగ్రెస్ , డీఎంకేలతో పాటు కొన్ని తమిళ పార్టీలు , కమ్యూనిస్టులు కూడా పొత్తుతో పోటీ చేశారు ఈ ఎన్నికల్లో.

-ఇక అన్నాడీఎంకేతో కలిసి తమిళనాట రంగంలోకి దిగింది బీజేపీ. ఐదు ఎంపీ సీట్లకు బీజేపీ అక్కడ పోటీ చేసింది. గత ఎన్నికల్లో తమిళనా ఒక ఎంపీ సీటును నెగ్గిన బీజేపీ ఈ సారి ఆ సంఖ్యను పెంచుకోవాలనే ప్రయత్నంలో ఉంది.

-ఏతావాతా నేడు పోలింగ్ జరుగుతున్న ప్రాంతంలో కాంగ్రెస్ కూటమికి, బీజేపీ కూటమికి గట్టి పోటీనే సాగుతూ ఉంది. ఈ సీట్లలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాల్సి ఉంది.